మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు, విరిగిన చేయి

By Pratap
|
Google Oneindia TeluguNews

NTR statue burnt in Medak district
మెదక్/ కరీంనగర్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించిన సంఘటన మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం చేబర్తి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామ చావిడి వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పంటించి చేయిని విరగ్గొట్టారు.

శుక్రవారం ఉదయం విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి భూమయ్యయాదవ్‌, సర్పంచ్‌ లు జమునాబాయి అర్జున్‌సింగ్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ ఇంద్రసేనారెడ్డి సంఘటనను ఖండించారు. నిందితులను కఠిణంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల మండలం సర్థాపూర్ గ్రామ శివారులో ఓ ప్రైవేటు స్కూలు బస్సు ప్రమాదానికి గురైంది. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనడానికి విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సును వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురికి గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 20 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన పిల్లల పట్ల పాఠశాల యాజమాన్యం సరిగా స్పందించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Telugudesam party founder and former CM NT Rama Rao statue has been destroyed in Medak district in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X