పడుకుంటే పాస్ చేస్తా... విద్యార్థిని పట్ల కరస్పాండెంట్ కీచక డిమాండ్
మచిలీపట్నం: మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి వయసున్న ఓ నర్సింగ్ కాలేజీ కరస్పాండెంట్ తన కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కన్నేశాడు. ఈ ఘటన సారా గ్రేస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో చోటుచేసుకుంది. ఇలా కొన్ని రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాలేజీ కరస్పాండెంట్‌ను అరెస్టు చేశారు.

లైంగిక కోరికలు తీర్చకుంటే ఫెయిల్ చేస్తా
22 ఏళ్ల ఏళ్ల విద్యార్థిని బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమెపై గత కొన్ని రోజులుగా కరస్పాండెంట్ ఎస్‌రమేష్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఇలా ఈమె ఒక్కదాన్నే కాదని మిగతా అమ్మాయిలను కూడా భయపెట్టే వాడని బాధితురాలు చెప్పింది. లైంగిక కోరికలు తీర్చాలంటూ బెదిరించేవాడని వెల్లడించింది. తన కోరిక కాదని వ్యతిరేకిస్తే వారికి కావాలనే ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వేసేవాడని విద్యార్థిని చెప్పింది.

మద్యం సేవించి క్లాస్‌రూమ్‌కు వచ్చేవాడు
రమేష్ బారిన పడి చాలామంది విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. అయితే బయటకు చెప్పేందుకు భయపడ్డారని బాధితురాలు పేర్కొంది. ఇక తరగతి గదికి మద్యం సేవించి వచ్చేవాడని, తన స్నేహితులకు పార్టీలు ఇచ్చేందుకు క్యాంపస్‌ను వాడుకునేవారని ఫిర్యాదులో పేర్కొంది. క్యాంపస్‌లో ఉన్న లేడీస్ హాస్టల్‌లోకి ప్రవేశించి వారితో అదోరకంగా ప్రవర్తించేవాడని బాధితురాలు చెప్పింది. తాను మూడునెలల క్రితమే హాస్టల్‌ను ఖాళీ చేసినట్లు బాధితురాలు తెలిపింది.

రమేష్ పై పాతకేసులు కూడా ఉన్నాయి
ఇక కులపరమైన దూషణలకు కూడా దిగుతూ... కొందరిని లైంగికంగా వేధించేవాడని చెప్పుకొచ్చింది. ఇక వియషం బయటకు పొక్కడంతో స్టూడెంట్స్ సంఘం ఎస్‌ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. దీంతో పోలీసులు కలగజేసుకుని రమేష్‌ను అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రమేష్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 2006లో కూడా కేరళ విద్యార్థినుల దగ్గరనుంచి ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేయగా ఆ సమయంలో ఆయన్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. బెయిల్‌పై బయటకు వచ్చి నర్సింగ్ కాలేజీ ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications