ఈ 5 తీసుకుంటే.. షుగరు రమ్మన్నా రాదు

శాస్త్రవేత్తలు ముతక ధాన్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకొని దానికి సూపర్ ఫుడ్ హోదా ఇస్తున్నారు. ఇది శతాబ్దాల నాటి ధాన్యం. ప్రతిరోజు తినడం వల్ల మధుమేహం మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. ఏ ధాన్యాలు తీసుకుంటే షుగరు దూరంగా ఉంటుందో తెలుసుకుందాం.

రాగి : రాగి అంటేనే సూపర్ ఫుడ్ కింద లెక్క. ప్రతిరోజు రాగులను తీసుకుంటుంటే మధుమేహం రమ్మన్నా రాదు. దీనిలో పీచు ఎక్కువగా ఉంటుంది. జీర్ణమవడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో రక్తంలో అకస్మాత్తుగా చక్కెర స్థాయులను పెరగదానికి ఇది అనుమతించదు. ఇవి యాంటీ డయాబెటిక్, యాంటీ ట్యూమోరిజెనిక్ అని తేలింది. ఇందులో ఉండే పాలీఫెనాల్ ఫొటోకెమికల్, డైటరీ ఫైబర్ ఉన్నాయి. ఇది వ్యాధులతో పోరాడటంలో రోగనిరోధకశక్తికి సహాయపడుతుంది.

 grains

ఫాక్స్ టైల్ : ఇది చాలా ముతక ధాన్యం. గ్లూటెన్ లేకుండా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర శాతం అకస్మాత్తుగా పెరగడానికి ఇది ఒప్పుకోదు. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.

పెర్ల్ మిల్లెట్ : కాల్షియం, ప్రొటీన్, ఐరన్, పీచు, మెగ్నీషియం, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్ తోపాటు అనేక రకాల విటమిన్లు, మినరల్స్ మిల్లెట్‌లో పుష్కలంగా ఉంటాయి. మిల్లెట్ ను తీసుకోవడంద్వారా డయాబెటిస్ పూర్తి నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం బలపడుతుంది. ఇది పూరాతనమైన ధాన్యం. సైంటిస్టులు మిల్లెట్ నాణ్యత గురించి తెలుసుకోవడంతో ఇది కూడా సూపర్ ఫుడ్ గా మారింది.

జొన్నలు : ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగిన జొన్నలను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహం తగ్గడంతోపాటు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.

కుట్కి (లిటిల్ మిల్లెట్) :ఇది ఒక కణిక ధాన్యం. కొన్ని శతాబ్దాలుగా దీన్ని సాగుచేస్తున్నారు. ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కార్బోహైడ్రేట్ నామమాత్రం. దీన్ని తినడం అంటే అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉన్నట్లు లెక్క. కుట్కీ డయాబెటిస్ ను ఎప్పటికీ అనుమతించదు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది దివ్యమైన ఔషధం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+