Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Tdp Boycott Assembly : అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన టీడీపీ..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై రెండు రోజులు కావస్తున్న సభా కార్యకలాపాలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చ కోరిన టీడీపీ.. అందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో నిన్న ప్రారంభమైన నిరసనల పర్వం ఇవాళ కూడా కొనసాగింది. దీంతో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ తో పాటు వైసీపీ సభ్యులు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్లు కొనసాగాయి.

అధికారపక్షం తీరుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు టీడీపీ ఎమ్మల్యేలు ప్రకటించారు. రేపట్నుంచి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. అసెంబ్లీ నుంచి ఇవాళ సస్పెండైన అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిపి మీడియా సమావేశం నిర్వహించిన అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అరెస్టుపై చర్చ నుంచి పారిపోయిందన్నారు.

Opposition TDP boycotts entire ap assembly session amid mlas serial suspensions

స్పీకర్ అసెంబ్లీని వైసీపీ కార్యాలయం కంటే దారుణంగా మార్చారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తమను యూజ్ లెస్ ఫెలోస్ అని తిట్టిన స్పీకర్ మాట వినాల్సిన అవసరం తమకు లేదన్నారు. స్పీకర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి అందరినీ ఒకేలా చూడాలన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో జనానికి తెలియకుండా స్పీకర్ అడ్డుకుంటున్నందునే తాము వీడియోలు తీశామన్నారు. సభలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగానే బాయ్ కాట్ చేసి బయటకి వచ్చామన్నారు. ఈ సెషన్ ముగిసేవరకూ అసెంబ్లీకి, మండలికి వెళ్లరాదని నిర్ణయించామన్నారు.

మరోవైపు టీడీపీ అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం ప్రకటన రాకముందే వైసీపీ సభ్యులతో అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చర్చ కొనసాగుతోంది. సభలో చోటు చేసుకున్న పరిణామాలతో ఐదుగురు టీడీపీ సభ్యులు ఈ సెషన్ ముగిసేవరకూ సస్పెండైన నేపథ్యంలో మిగతా వారిపైనా ఏరోజుకారోజు సస్పెన్షన్ వేటు వేస్తుండటంతో విపక్షం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+