వైసీపీకి ఇక లేదు - జనసేనకే ఆ కీలక పదవి..!!

ఏపీలో రాజకీయం మరోసారి ఆసక్తి కరంగా మారుతోంది. ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన కూటమి పాలన ప్రారంభించింది. కొత్తగా ఎన్నికలైన సభ్యులతో అసెంబ్లీ కొలువు తీరేందుకు సిద్దమైంది. అటు అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ అయ్యన్న పాత్రుడు పేరు ఖరారైంది. డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక..ప్రతిపక్ష పార్టీకి దక్కే కీలక పదవి వైసీపీకి కాదని..జనసేనకు ఇచ్చేలా నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

జనసేనకు ప్రాధాన్యత
ఏపీలో కొత్త ప్రభుత్వంలో జనసేన భాగస్వామి అయింది. జనసేనాని పవన్ డిప్యూటీ సీఎంగా..మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. వారికి శాఖలు ఖరారయ్యాయి. ఇక..స్పీకర్ గా టీడీపీ నుంచి సీనియర్ నేత అయ్యన్న పేరు ఖాయమైంది. డిప్యూటీ సీఎం పదవి మిత్రపక్షం జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా లోకం మాధవి, పంతం నానాజీ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. స్పీకర్ పదవి ఉత్తరాంధ్ర కు చెందిన అయ్యన్నకు ఇస్తుండటంతో..అదే ప్రాంతానికి చెందిన మాధవికి డిప్యూటీ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.

PAC Chairman post to allot for Janasena as second biggest party in the assembly as reports

వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కేనా
సామాజిక వర్గం పరంగా మాధవికి ఛాన్స్ ఉంది. అయితే, ప్రాంతీయ కోణంలో పంతం నానాజీకి అవకాశం కనిపిస్తోంది. దీని పైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక.. వైసీపీకి ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 18 స్థానాలు రాకపోవటంతో ప్రతిపక్ష పాత్ర ఎవరిదనే చర్చ జరుగుతోంది. మూడు పార్టీల కూటమికి 164 సీట్లు రావటంతో...సాంకేతికంగా సీట్లు లేకపోయినా వైసీపీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందనే వాదన ఉంది. అయితే, అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కాకుండా సాధారణ ఎమ్మెల్యేల హోదాలోనే సీట్ల కేటాయింపు జరుగుతందని టీడీపీ నేతల సమాచారం.

జనసేనకు పీఏసీ ఛైర్మన్ పదవి
ఇక, సహజంగా ప్రతిపక్ష పార్టీకి పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్) పదవి దక్కుతుంది. 2014-2019 టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నుంచి తొలుత భూమా నాగిరెడ్డి ఆ తరువాత బుగ్గన ఈ పదవి నిర్వహించారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ కొనసాగారు. ఇప్పుడు ఈ పదవి జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జనసేన నుంచి గతంలో కాంగ్రెస్ లో మంత్రిగా పని చేసిన కొణతాల రామక్రిష్ణ పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ సమావేశాల సమయంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా..పీఏసీ ఛైర్మన్ పదవి పైన అధికారికంగా నిర్ణయం వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+