Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చిరంజీవి, వెంకయ్యకు పద్మవిభూషణ్: మాటలు రావడం లేదంటూ మెగాస్టార్ భావోద్వేగం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికే పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వైజయంతి మాలతోపాటు ఐదుగురికి ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది.

తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలికి, పద్మ సుబ్రమణ్యమ్‌కు పద్మ విభూషణ్ వరించింది. సామాజిక సేవ విభాగంలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పాఠక్‌కు పద్మ విభూషన్ వరించింది. తెలంగాణకు చెందని ఆనందచారికి పద్మశ్రీ లభించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ (మరణంతరం) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్డ విన్న తర్వాత తనకు మాటలు రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులు, కుటుంబసభ్యుల సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తనకు సాధ్యమైనంత అవసరమున్నవారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి, తాను ఈ స్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Padma vibhushan for chiranjeevi and venkaiah: list of padma bhushan and padma vibhushan awardee list

పద్మ విభూషణ్ గ్రహీతల జాబితా:

బిందేశ్వర్ పాఠక్: సామాజిక సేవం బీహార్
వెంకయ్య నాయుడు: ప్రజా వ్యవహారాలు: ఆంధ్రప్రదేశ్
చిరంజీవి: కళారంగం: ఆంధ్రప్రదేశ్
వైజయంతి మాల బాలి: కళారంగం: తమిళనాడు
పద్మ సుబ్రమణ్యం: కళారంగం: తమిళనాడు.

పద్మ భూషణ్ వరించిన వారి జాబితా:

ఎం ఫాతిమా బీవీ: ప్రజా వ్యవహారాలు: కేరళ
మిథున్ చక్రవర్తి: కళలు: పశ్చిమబెంగాల్
హర్మస్ జీ ఎన్ కామా: సాహిత్యం, విద్య, జర్నలిజం: మహారాష్ట్ర
సీతారామ్ జిందాల్: వాణిజ్యం, పరిశ్రమలు: కర్ణాటక
యువాంగ్ లీయూ: వాణిజ్యం, పరిశ్రమలు: తైవాన్
అశ్విన్ బాలచంద్ మెహతా: వైద్యం: మహారాష్ట్ర

సత్యబ్రత ముఖర్జీ(మరణాంతరం): ప్రజా వ్యవహారాలు: పశ్చిమబెంగాల్
రామ్ నాయక్: ప్రజా వ్యవహారాలు: మహారాష్ట్ర
తేజస్ మధుసూదన్ పటేల్ం వైద్యం: గుజరాత్
ఓలంచేరి రాజగోపాల్: ప్రజా వ్యవహారాలు: కేరళ

దత్తాత్రేయ రిన్‌పోచే (మరణాంతరం): ఆధ్యాత్మికం: లఢఖ్
ప్యారేలాల్ శర్మ: కళలు: మహారాష్ట్ర
చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్: వైద్యం: బీహార్
ఉసా ఉతప్: కళలు: పశ్చిమబెంగాల్
కెప్టెన్ విజయ్ కాంత్(మరణాంతరం): కళలు: తమిళనాడు
కుందన్ వ్యాస్: సాహిత్యం, విద్య, జర్నలిజం: మహారాష్ట్ర

పద్మశ్రీ అవార్డులు విభాగాల వారీగా:

కళలు:
గడ్డం సమ్మయ్య: తెలంగాణ
దాసరి కొండప్ప: తెలంగాణ
ఉమామహేశ్వరి : ఆంధ్రప్రదేశ్
జానకీలాల్: రాజస్థాన్
గోపీనాథ్ స్వైన్: ఒడిశా
భాగబత్ పదాన్: ఒడిశా
స్మృతి రేఖ చక్మా: త్రిపుర
ఓంప్రకాశ్ శర్మ: మధ్యప్రదేశ్
నారాయణన్ ఈపీ: కేరళ

సనాతన్ రుద్ర పాల్: పశ్చిమబెంగాల్
నేపాల్ చంద్ర సూత్రధార్: పశ్చిమబెంగాల్
రతన్ కహార్: పశ్చిమబెంగాల్
భద్రప్పన్ ఎం: తమిళనాడు
జోర్డాన్ లేప్పా: సిక్కిం
మిచహన్ నాసా: మణిపూర్
శంతీదేవీ పాసవాన్, శివన్ పాసవాన్: బీహార్
అకోశ్ కుమార్ బిశ్వాస్: బీహార్
బాలకృష్ణన్ సాధనమ్ పుథియా వీతిల్: కేరళ
బాబూ రాంయాదవ్: ఉత్తరప్రదేశ్

సామాజిక సేవా విభాగం:

సోమన్న: కర్ణాటక
జగేశ్వర్ యాదవ్: ఛత్తీస్‌గఢ్
చామి ముర్మూ: జార్ఖండ్
గుర్విందర్ సింగ్: హర్యానా
దుఖు మాఝీ: పశ్చిమబెంగాల్
సంగ్ధాన్‌కిమా: మిజోరం

వైద్య విభాగం:

హేమచంద్ మాంఝీ: ఛత్తీస్‌గఢ్
యజ్దీ మాణెక్ షా ఇటాలియా: గుజరాత్
ప్రేమ ధన్‌రాజ్: కర్ణాటక

క్రీడా విభాగం:
ఉదయ్ విశ్వనాథ్ దేశ్ పాండే: మహారాష్ట్ర

మిగితా విభాగాలు:
యనుంగ్ జామెహ్ లెగో: అరుణాచల్ ప్రదేశ్
సర్బేశ్వర్ బాసుమతరి: అస్సాం
సత్యనారాయణ బెలేరి: కేరళ
కె చెల్లామ్మళ్: అండమాన్ వికోబార్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+