బాబు సభలో వైసిపి ఎంపీ అవినాష్, పులివెందులలో జగన్‌కు 'ఎన్టీఆర్'తో చెక్
కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.
పులివెందుల: కడప జిల్లా పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు అవినాశ్ రెడ్డి కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సభా వేదిక పైనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు సమస్యలను వివరించారు.
అవినాశ్ ఇంకా మాట్లాడుతూ.. కృష్ణా జలాలు పులివెందులకు రావడం సంతోషమన్నారు. పైడిపాలెం ప్రాజెక్టుకు వైయస్ రాజసేఖర రెడ్డి శంకుస్థాపన చేశారని, ఇప్పటికి ఇది పూర్తి కావడం ఆనందంగా ఉందన్నారు.
అంతకుముందు, చంద్రబాబు పైడిపాలెం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి పులివెందుల బ్రాంచి కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
నాకు ఈ పదవి అవసరం లేదని మోడీకి చెప్పా: జగన్ ఇలాకాలో చంద్రబాబు
పులివెందులకు నీళ్లు రాకుండా వైసిపి అడ్డుకుందని ఆరోపించారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చి తామేమిటో నిరూపించుకున్నామన్నారు. ఇక పులివెందులలో గొడవలు ఉండవని చెప్పారు. పులివెందులను దేశానికి ఆదర్శంగా మారుస్తానని చెప్పారు.

పులివెందులకు నీళ్లు ఇచ్చినందుకు వైసిపి నేతలు అసహనంతో ఉన్నారన్నారు. ఇక్కడ ప్రతి ఎకరాకు నీరు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. అనుభవం లేని వ్యక్తులు నన్ను విమర్శిస్తున్నా మీకోసం (ప్రజలు) భరిస్తున్నానని చెప్పారు. ఎప్పుడు పులివెందుల ఫ్యాక్షన్‌తో రగిలి పోవాలని కోరుకుంటున్నారని వైసిపిని ఉద్దేశించి మండిపడ్డారు.
పైడిపాలెం ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు
చంద్రబాబు ప్రారంభించిన పైడిపాలెం ప్రాజెక్టుకు చంద్రబాబు ఎన్టీఆర్ సాగర్‌గా నామకరణం చేశారు. ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి ఈ ప్రతిపాదన చేయగా, చంద్రబాబు ఆ పేరు పెట్టారు. అయితే, వైయస్ ఇలాకా అయిన కడప జిల్లాలో ఈ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం జగన్‌కు చెక్ పెట్టేందుకేనని అంటున్నారు. ఎన్టీఆర్ సాగర్ పేరు వ్యూహాత్మకం అంటున్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications