Viral Video: రాజకీయ దిగ్గజాల కాళ్లు మొక్కిన టీడీపీ అభ్యర్ధి నిమ్మల..!

ఏపీలో నిన్న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్దులు జోరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్నారు. కొందరు భారీ ర్యాలీలతో వెళ్తుంటే, మరికొందరు ఎలాంటి హంగామా లేకుండా వెళ్లి నామినేషన్లు దాఖలు చేసి వస్తున్నారు. పలువురు ముహుర్తాలు చూసుకుని నామినేషన్లకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో పాలకొల్లు సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్ధి నిమ్మల రామానాయుడు మరోప్రయత్నం చేసారు.

పాలకొల్లు ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచిన నిమ్మల రామానాయుడు గత అసెంబ్లీలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కూడా పనిచేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రామానాయుడుకి జిల్లాలో మిగతా సామాజిక వర్గాల నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి పాలకొల్లు నుంచి పోటీకి నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతల ఆశీస్సుల్ని ఆయన తీసుకున్నారు.

palakollu tdp candidate nimmala ramanaidu take blessings of senior politicians before nomination

కాపు,బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య, మాజీ మంత్రి, ఆచంట టీడీపీ అభ్యర్ది పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి( బాబ్జి), మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ లను రామానాయుడు స్వయంగా కలిసి పాదాభివందనం చేసి మరీ ఆశీస్సులు తీసుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధించేలా ఆశీస్సులు అందించాలని వారిని కోరినట్లు రామానాయుడు ఎక్స్ లో వీడియో పోస్టు పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+