Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగనన్నా క్షమించు.. టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తున్నా: వైసీపీ నేత సంచలనం

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్చూరు వైసీపీ నేత గొట్టిపాటి భరత్ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దర్శి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన తన సోదరి గొట్టిపాటి లక్ష్మికి మద్దతు ప్రకటించారు. అనివార్య పరిస్థితుల్లో తన అక్కకు మద్దతుగా నిలుస్తున్నానని, పర్చూరు నియోజకవర్గ ప్రజలు క్షమించాలని కోరారు.

ఎప్పుడూ ఎందుకు అని అడగలేదు
తాను 150 ఎకరాల పొలం అమ్మినా ఎందుకు? అని ఒక్క మాట కూడా తన అక్క లక్ష్మి నోరుతెరిచి అడగలేదని, వెంటనే సంతకం పెట్టిందని, ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టినా ఏనాడూ ప్రశ్నించలేదని భరత్ తెలిపారు. పర్చూరు కార్యకర్తలు ఎవరు వెళ్లినా నామమాత్రపు ఫీజు తీసుకొని వైద్యం చేసిందని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇంతవరకు తనను ఏమీ అడగని అక్కడ ఈ ఎన్నికల్లో తోడుగా నిలబడమని అడిగిందని, అది ధర్మంగా భావించి దర్శికి వెళుతున్నట్లు చెప్పారు. జగనన్న తనను క్షమించాలని, తనపై ఎంతో ప్రేమ, ఆప్యాయతలు చూపించారని, కాకపోతే ధర్మం కోసం అక్కకు తోడుగా నిలబడుతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు.

parchur ysrcp leader gottipati bharath support to darsi tdp mla candidate lakshmi

కొత్తవారితో సమన్వయ లోపం
2014 ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ పర్చూరుకు ఇన్ ఛార్జిగా నియమించారని, ఐదు సంవత్సరాల పోరాటంలో ఎన్నో కేసులు, అవమానాలు ఎదురయ్యాయన్నారు. ప్రజలంతా తనకు తోడుగా నిలబడ్డారన్నారు. ఇన్ ఛార్జి మార్పులవల్ల కొత్తవారితో సమన్వయ లోపం ఏర్పడుతుండటంతో అసలైన వైసీపీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడు భరత్. 2013లో నరసయ్య కన్నుమూయగా భరత్ ను ఇన్ ఛార్జిగా నియమించారు. తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో ఏలూరు సాంబశివరావు చేతిలో ఓటమిపాలయ్యారు. తర్వాత పార్టీలో యాక్టివ్ కాలేదు. తన సోదరికి టీడీపీ టికెట్ ప్రకటించడంతో అటువైపుగా అడుగులు పడుతున్నట్లు భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+