మా ఆయన మూర్ఖుడు కాదు: పవన్ కళ్యాణ్ గుండుపై పరిటాల సునీత
Recommended Video

అనంతపురం: పరిటాల రవీంద్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు గుండు కొట్టించారనే ప్రచారంపై మూడు రోజుల క్రితం జనసేనాని స్పందించారు. తాజాగా సోమవారం మంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత కూడా ఈ అంశంపై మాట్లాడారు. పవన్ చెప్పింది వాస్తవమే అన్నారు.
పవన్ కళ్యాణ్‌కు తన భర్త పరిటాల రవి గుండు ఎందుకు కొట్టిస్తారని ఆమె అన్నారు. మా ఆయన అంత మూర్ఖుడు కాదని చెప్పారు. ఈ విషయంలో ప్రజలు నిజాలు తెలుసుకోవాలని తాను కూడా కోరుతున్నానని చెప్పారు. పవన్‌కు గుండు కొట్టించారన్నది పూర్తి అవాస్తవం అని చెప్పారు.

పవన్ కళ్యాణ్ నిజం చెప్పారు
పవన్ కళ్యాణ్ ఈ విషయంలో నిజం చెప్పారని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మవద్దని పరిటాల సునీత విజ్ఞప్తి చేశారు. కాగా, తనకు పరిటాల రవి గుండు కొట్టించలేదని, అదంతా అబద్దమని, ఆనాడు తాను సినిమాలపై విరక్తితో తానే గుండు కొట్టించుకున్నానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

అందుకే పవన్ నాడు మద్దతిచ్చారు
చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అని, రాష్ట్ర అభివృద్ధి కోసమే 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారని పరిటాల సునీత చెప్పారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి అందరికీ కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

కళ్లముందు కనిపిస్తున్నా బూటకంగా కనిపిస్తోందా
నవ్యాంధ్ర అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం బూటకంగా కనిపిస్తోందని పరిటాల సునీత ధ్వజమెత్తారు. కాగా, వైసీపీ అధినేత వైయస్ జగన్ పాదయాత్ర అనంతపురంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

ఉరవకొండలో ముగిసిన జగన్ పాదయాత్ర
జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఉరవకొండలో ముగిసింది. అనంతరం పరిటాల సునీత నియోజకవర్గమైన రాప్తాడులో అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications