అభ్యర్థి ఎంపికలో నేను మధ్యవర్తిగా, సర్వే ఆధారంగానే టిక్కెట్టు శిల్పా సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి విషయమై సస్పెన్ష్ కొనసాగుతోంది. భూమా కుటుంబానికి టిక్కెట్టు కేటాయిస్తే తన దారి తాను చూసుకొంటానని టిడిపి ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.అయితే అభ్యర్థి ఎంపిక విషయంలో తాను మధ్యవర్తిగా వ్యవహారిస్తానని ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పారు.

కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.అయితే నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను ఖచ్చితంగా బరిలో ఉంటానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు.

చంద్రబాబునాయుడుతో రెండు రోజుల క్రితం శిల్పా సోదరులు సుధీర్ఘంగా సమావేశమయ్యారు.ఈ సమావేశం తర్వాత టిడిపి అధినేత బాబు ఆలోచనల్లో మార్పులు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ ఉప ఎన్నికల సందర్భంగా అభ్యర్థి ఎంపిక చేసే విషయం కత్తిమీద సాముగా మారింది చంద్రబాబునాయుడుకు. ఈ విషయంలో భూమా, శిల్పా కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

 మధ్యవర్తిని మాత్రమే అంటున్న చక్రపాణిరెడ్డి

మధ్యవర్తిని మాత్రమే అంటున్న చక్రపాణిరెడ్డి


నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.అయితే నంద్యాల టీడిపి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో తాను మధ్యవర్తిని మాత్రమేనని టీడీపీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ అధిష్టానం సర్వే నిర్వహిస్తోందని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు.

గెలుపొందే అభ్యర్థికే టిక్కెట్టు

గెలుపొందే అభ్యర్థికే టిక్కెట్టు

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో గెలిచే అభ్యర్థికే టిక్కెట్టును కేటాయించాలనే ఆలోచనలో పార్టీ ఉందని చక్రపాణిరెడ్డి చెప్పారు. ఈ మేరకు ఎవరు ఈ నియోజకవర్గంలో గెలిచే సత్తా ఉందో పార్టీ సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. అలాగే అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొంటుందని చెప్పారు.అయితే ఈ విషయంలో తన సోదరుడైనా మరేవరైనా ఒక్కటేనని చెప్పారు.

భూమా, శిల్పా కుటుంబాలను సంతృప్తి పర్చడం సాధ్యమేనా?

భూమా, శిల్పా కుటుంబాలను సంతృప్తి పర్చడం సాధ్యమేనా?

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాను పోటీచేస్తానని శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. బాబుతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదని బాబు శిల్పాకు సూచించారు.

అయితే సంప్రదాయం ప్రకారంగా చనిపోయిన కుటుంబం నుండి టిక్కెట్టును కేటాయించడం సంప్రదాయం. ఇదే విషయాన్ని మంత్రి అఖిలప్రియ గుర్తు చేశారు. మరో వైపు 2014 ఎన్నికల్లో తాను పోటీచేసి ఓటమిపాలైన విషయాన్ని శిల్పా గుర్తుచేస్తున్నారు. అయితే ఈ రెండు కుటుంబాలను సంతృప్తి చేయడం సాధ్యమయ్యే పనికాదు. అయితే శిల్పాకు టిక్కెట్టు కేటాయించకపోతే ఆయన వైసీపి గూటికి చేరే అవకాశం లేకపోలేదనే ప్రచారం కూడ ఉంది.

శోభా నాగిరెడ్డి వర్థంతి రోజునే కీలక నిర్ణయం

శోభా నాగిరెడ్డి వర్థంతి రోజునే కీలక నిర్ణయం


శోభానాగిరెడ్డి వర్థంతి రోజునే భూమా కుటుంబం నుండి పోటీ చేసే అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. అయితే భూమా నాగిరెడ్డి సోదరుడు వీరశేఖర్ రెడ్డి కొడుకు లేదా భూమా అఖిలప్రియ సోదరి మౌనికా పేరు విన్పిస్తోంది.అయితే ఎవరిని బరిలోకి దించాలనే విషయాన్ని మాత్రం శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున ప్రకటించే అవకాశం ఉంది. అయితే భూమా కుటుంబం ఈ విషయమై క్లియర్ చేయగానే పార్టీ అధిష్టానం కూడ పోటీచేసే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.ఈ మేరకు మరో నాలుగు రోజుల్లో పార్టీ అభ్యర్థిని ప్రకటించనున్నట్టు చక్రపాణి రెడ్డి చెబుతున్నారు.

గ్రూపుల సమన్వయం సాధ్యమేనా?

గ్రూపుల సమన్వయం సాధ్యమేనా?

ఒకవేళ ఈ ఎన్నికల్లో భూమా కుటుంబానికి టిక్కెట్టును కేటాయిస్తే శిల్పా పార్టీలోనే కొనసాగితే ఆ వర్గం నుండి ఏ మేరకు సహకరిస్తారనేది ఉత్కంఠ నెలకొంది. మరో వైపు అధ్బుతం జరిగి శిల్పా మోహన్ రెడ్డికి టిక్కెట్టు కేటాయిస్తే భూమా నాగిరెడ్డి గ్రూపు ఏ మేరకు సహకరిస్తారనేది చర్చ సాగుతోంది.అయితే రాజకీయాల్లోకి వచ్చిన అఖిలప్రియ మూడేళ్ళు మాత్రమే. అయితే రాజకీయ ఉద్దండులను ఢీకొట్టగలరా అనే చర్చ కూడ లేకపోలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
party conducting survey for selecting candidate for Nandhyala by poll said MLC silpa Chakrapani Reddy on Friday.as per the survey result Chandrababu Naidu will select candidate.
Please Wait while comments are loading...