Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్నామస్మరణలో పవన్, అక్కడే లాజిక్ మిస్ -బూమ్ రాంగ్..!!

జనసేనాని పవన్ దూకుడు పెంచారు. తన వారాహి యాత్రలో ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేసారు. యాత్ర ప్రారంభించి నెల రోజులు పూర్తయింది. యాత్ర మొత్తంలో జగన్ ను దూషించటమే అజెండాగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ పైన చేస్తున్న వ్యాఖ్యలు..రకరకాల పేర్లతో సంబోధిస్తున్న తీరు చర్చగా మారింది. టీడీపీ ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారనే అభిప్రాయం కలుగుతోంది. ఈ వ్యాఖ్యలతో పవన్ అనుకున్నట్లుగా జగన్ కు నష్టం చేస్తున్నారా..తానే నష్టపోతున్నారా..ఏం జరుగుతోంది.

జగన్ పైన పవన్ వ్యాఖ్యలు : పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో ప్రతీ నిమిషం జగన్ పేరుతో స్మరిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ జగన్ తన పాలన ద్వారా పేదలకు జరిగిన మంచి వివరిస్తూ ప్రజలను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. తాను నమ్మకున్న ఓట్ బ్యాంక్ ను సుస్థిరం చేసుకొనేందుకు అడుగులు వేస్తున్నారు. ఇటు టీడీపీతో జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తోంది.

pawanboomrang1

ప్రతిపక్షాలు కలిసి వచ్చినా..తన విజయం ఆపలేరని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ తన ప్రసంగాల్లో జగన్ ను టార్గెట్ చేస్తూ...ఏకవచనంతోనే పిలుస్తా, రౌడీ పిల్లోడు, జగ్గూభాయ్ వంటి వ్యాఖ్యలతో పవన్ స్థాయి పెరుగుతుందా..తగ్గుతుందా అనే చర్చ మొదలైంది. దీని ద్వారా జగన్ కు చంద్రబాబు కంటే తానే సరైన ప్రత్యర్ధి అని ఎస్టాబ్లిష్ చేసుకొనేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు.

రాజకీయంగా నష్టం చేసేలా : అక్కడే పవన్ లాజిక్ మిస్ అవుతున్నారు. చంద్రబాబు తన ప్రసంగాల్లో సీఎం జగన్ ను కార్నర్ చేస్తారు. కానీ, ఈ తరహా వ్యాఖ్యలు చేయరు. పవన్ ఇప్పుడు జగన్ పైన సినిమా స్టైల్ లో డైలాగ్స్ పేల్చుతున్నారు. కానీ, ఇది రాజకీయంగా నష్టం చేస్తాయనే ఆలోచన మర్చిపోతున్నారు.

గతంలో ప్రజారాజ్యం లో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన 2009 ఎన్నికల్లో నాటి వైఎస్సార్ ను పంచెలూడదీస్తాం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి భారీ నష్టానికి కారణమయ్యాయి. అదే విధంగా నంద్యాల ఉప ఎన్నికల్లో విపక్ష నేతగా జగన్ నాటి సీఎం చంద్రబాబు పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దూషణలు...వేధింపులు ఏనాడు ఆంధ్రాజనం ఆదరించరనే విషయం పవన్ మర్చిపోతున్నారనే విశ్లేషణలు మొదలయ్యాయి.

jaganpawan

దూషణలతో ఓట్లు దక్కేనా : 2017లో జగన్ విపక్ష నేతగా పాదాయత్ర చేస్తూ చంద్రబాబు వైఫల్యాలు చెబుతూ..తనకు అవకాశం ఇస్తే ఏం చేస్తానో ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేసారు. ఫలితంగా 151 సీట్లు సాధించారు. ఇప్పుడు పవన్ ప్రతీ సభలో ఒకే విధమైన ప్రసంగాలు...జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. పాలనా పరంగా తాను ఏం చేస్తానో..పథకాల అమలులో చేయాల్సింది ఏంటో..

ప్రభుత్వ మార్పుకు అవసరం ఏంటో వివరించటంలో మాత్రం ప్రణాళికా..అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ ప్రసంగాలకు..సినిమా డైలాగ్స్ తరహా పంచ్ లకు సభల్లో స్పందన కనిపించినా..ఈ తరహా ప్రసంగాలు ఓల్లు తెచ్చిపెట్టవనేది సుస్పష్టం. పవన్ నుంచి ఈ తరహా ప్రసంగాలే ఆశిస్తున్న టీడీపీ నేతల ట్రాప్ లో పవన్ చిక్కుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+