ఆళ్లగడ్డపై పవన్ జోక్యం: వద్దని బాబుకు, జగన్‌కు ఊరట!

హైదరాబాద్: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక పైన ఉత్కంఠకు తెర పడింది! ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయవద్దని దాదాపుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణే కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ చొరవతో బరి నుండి తప్పుకోవాలని టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల కృష్ణా జిల్లా నందిగామ ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. తండ్రి మృతి చెందడంతో ఆమె స్థానంలో టీడీపీ తరఫున తంగిరాల సౌమ్య పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలోని సాంప్రదాయాన్ని అనుసరించి పోటీకి దూరంగా ఉంది.

ఇప్పుడు ఆళ్లగడ్డ నుండి కూడా శోభా నాగిరెడ్డి మృతి చెందడంతో.. ఆమె స్థానంలో పోటీ చేస్తున్న కూతురు అఖిల ప్రియ పైన టీడీపీ పోటీ పెట్టదని వైసీపీ భావిస్తోంది. అయితే, టీడీపీ మంతనాలు చూస్తుంటే పోటీ చేసే అవకాశాలే ఉన్నట్లుగా కనిపించింది. అంతేకాకుండా స్థానిక నేతలు కూడా పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. చంద్రబాబు పైన ఒత్తిడి తెచ్చారు.

Pawan intervention: TDP not to contest in Allagadda

ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి నిలబెట్టవచ్చుననే ఉత్కంఠ కొనసాగింది. రెండు రోజుల క్రితం స్థానిక టీడీపీ నేత మాట్లాడుతూ.. తాము ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తామని, చంద్రబాబు విశాఖ పర్యటన ముగించుకొని వచ్చాక నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు.

అయితే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కల్పించుకున్నారని తెలుస్తోంది. పార్టీలు పాటిస్తున్న సంప్రదాయం ప్రకారం పోటీకి నిలబెట్టవద్దని చంద్రబాబుకు పవన్ సూచించారని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు పార్టీ నేతలకు అదే అంశమై సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. అయితే, చంద్రబాబు కూడా పోటీకి విముఖత చూపినప్పటికీ, పార్టీ నేతల నుండి వస్తున్న ఒత్తిడి కారణంగానే ఇన్నాళ్లు ఉత్కంఠ సాగిందని అంటున్నారు.

ఎన్నికల షెడ్యూల్

నామినేషన్లు - అక్టోబర్ 14 - 21 వరకు
పరిశీలన - అక్టోబర్ 22న
ఉపసంహరణ - అక్టోబర్ 24న
పోలింగ్ - నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+