వలంటీర్ల వల్ల గద్ద కాళ్ల కింద కోడిపిల్లల్లా తయారైన ఆడపిల్లలు: మళ్లీ పవన్ ఘాటు వ్యాఖ్యలు

ఏలూరు: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.

మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

Pawan Kalyan again slams CM YS Jagan and Volunteers

ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. వలంటీర్లు తొలుత ఇళ్లపై రెక్కీలు నిర్వహిస్తోన్నారని, అనంతరం ఒంటరి ఆడపిల్లలను టార్గెట్ చేస్తోన్నారని అన్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండే ఆడపిల్లలపై దాడులు చేయడానికి అవకాశాలను వెదుక్కుంటోన్నారని ఆరోపించారు. లొంగని అమ్మాయిలను పథకాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

సంక్షేమ పథకాల లబ్దిని అందజేయడానికి పత్రాలు సరిగ్గా లేవని వలంటీర్లు.. ఒంటరి అమ్మాయిలు, మహిళలను బెదిరిస్తోన్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు. వలంటీర్ల వల్ల పల్లెల్లో ఉండే ఆడపిల్లల పరిస్థితి.. గద్ద కాళ్ల కింద నలిగిన కోడిపిల్లల్లా తయారైందని అన్నారు. వలంటీర్ల దౌర్జన్యానికి గురైన అమ్మాయిలు- పరువు పోతుందనే ఉద్దేశంతో తమకు జరిగిన దారుణాన్ని బయటికి చెప్పుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

Pawan Kalyan again slams CM YS Jagan and Volunteers

తమను ఇబ్బందులకు గురి చేసిన వలంటీర్లపై పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు చేయాలని, సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంప్లైంట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు. వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వలంటీర్ల పట్ల తనకు సదుద్దేశం ఉందని, వారందరూ తన అక్క చెల్లెళ్లు, సోదర సమానులని పేర్కొన్నారు.

వారిలో అందరూ చెడ్డవాళ్లని తాను చెప్పట్లేదని, కొందరి వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. వారికి అందుతోన్న 5,000 రూపాయల గౌరవ వేతనానికి మరో 5,000 రూపాయలను కలిపి ఇచ్చే మనస్తత్వం తనదంటూ చెప్పుకొచ్చారు. వలంటీర్ల పొట్ట కొట్టాలనేది తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+