పిఠాపురం మహిళలకు పవన్ మరో గిఫ్ట్..! అన్నయ్య పుట్టినరోజున..!
ఏపీలో తొలిసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించిన పిఠాపురం ప్రజల రుణం తీర్చుకునేందుకు ఏ చిన్న అవకాశం దొరికినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వదులుకోవడం లేదు. ఇప్పటికే పిఠాపురం అభివృద్ధితో పాటు సంక్షేమం విషయంలో తన పరపతిని ఉపయోగించి పలు కార్యక్రమాలు చేపడుతున్న పవన్ కళ్యాణ్.. పండుగలకూ అక్కడి మహిళలకు కానుకలు అందిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో మరోసారి ఆయన పిఠాపురం మహిళలకు శ్రావణ శుక్రవారం కానుక అందించబోతున్నారు.
పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శ్రావణ మాసంలోని చివరి శుక్రవారం శ్రీ పాదగయ క్షేత్రంలోని ఉమా కుక్కుటేశ్వరస్వామి, పురుహూతిక అమ్మవారి ఆలయంలో పిఠాపురం ఆడపడుచులకు సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఈ వరలక్ష్మీ వ్రతాలు ప్రారంభమవుతాయి. మొత్తం 5 విడతలుగా వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఒక్కో బ్యాచ్ కు ఒక్కో అమ్మవారి పేరునా అంబిక, భ్రమరాంబ, చాముండి, దుర్గ, ఈశ్వరి అని నామకరణం చేశారు. అంబిక భక్త బృందం ఉదయం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు, భ్రమరాంబ భక్త బృందం 6.30 గంటల నుంచి 8 గంటలు వరకు, చాముండి భక్త బృందం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, దుర్గ భక్త బృందం 9.30 నుంచి 11 గంటల వరకు, ఈశ్వరి భక్త బృందం 11 నుంచి 12.30 గంటల వరకు వరలక్ష్మీ వత్రం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 1 గంట తరువాత వచ్చే ఆడపడుచులకు కూడా పవన్ కళ్యాణ్ పంపించిన పసుపు, కుంకుమ, చీరలను కానుకగా అందిస్తారు. మొత్తం 10 వేల మంది ఆడపడుచులకు చీరల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కూపన్ల పంపిణీ రేపు ప్రారంభమవుతుంది. కూపన్ల మీద సమయం కూడా ముద్రిస్తున్నారు. ఆ సమయం బట్టి వత్రానికి ఏర్పాట్లు చేసుకోవాలని మహిళలకు సూచించారు. వాతావరణం అనుకూలిస్తే ఒకే విడతలో వెయ్యి నుంచి 1500 మంది వరకు వరలక్ష్మీ వత్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. చీరలను దేవాలయ సిబ్బంది, పోలీసులు, జనసేన వాలంటీర్లు పంపిణీ చేస్తారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications