రాజ్యసభకు కాదు- నాగబాబుకు పదవి పై పవన్ సంచలన నిర్ణయం..!!

డిప్యూటీ సీఎం పవన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు వేళ అనూహ్య ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీ, ఆ తరువాత మంత్రి అవుతారని కూటమి నేతలు భావించారు. నాగబాబుకు మంత్రి పదవి పైన చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవుల భర్తీ పైన కసరత్తు కొనసాగు తోంది. ఈ క్రమంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని చెబుతున్నా కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో డైలమా కొనసాగుతోంది. దీంతో, ఈ సస్పెన్స్ కు ముగింపు పలుకుతూ పవన్ కీలక నిర్ణయం ప్రకటించారు.

నాగబాబు పేరు ఖరారు
ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ పైన చంద్రబాబు - పవన్ చర్చించారు. మెగా బ్రదర్ నాగబాబుకు ఎమ్మె ల్సీ - మంత్రి పదవి పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ స్థానాల ఖరారు వేళ నాగబాబును ఎమ్మెల్సీ చేసి.. మంత్రి పదవిలోకి తీసుకుంటామని నాడు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు భర్తీ చేయాల్సిన అయిదు స్థానాల పైన ఈ ఇద్దరి మధ్య చర్చలో చివరి నిమిషంలో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి వద్దని.. రాజ్యసభకు పంపాలనే ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగింది. కాగా, దీని పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నిక ల్లోనే నాగబాబును జనసేన నుంచి బరిలోకి దింపుతున్నారు.

Pawan Kalyan Announces MLC seat for Nagababu in present MLA quota as latest Decision

పవన్ ప్రకటన
జనసేన ఎమ్మెల్సీ అభ్యర్దిగా నాగబాబు పేరును పవన్ ప్రకటించారు. నాగబాబుకు తొలుత 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించాలని భావించారు. పొత్తు లో భాగంగా ఆ సీటు బీజేపీ కోరటంతో నాగబాబు తప్పుకున్నారు. ఇక, రాజ్యసభ ఇస్తారనే హామీతో ఆయన నిరీక్షించారు. కూటమికి కొద్ది నెలల క్రితం మూడు రాజ్యసభ స్థానాలు దక్కాయి. మారిన సమీకరణాలతో ఆ సమయంలోనూ నాగబాబుకు అవకాశం దక్కలేదు. అదే సమయంలో నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీ అయిన తరువాత కేబినెట్ లో చేరుతారని జనసేన నేతలు చెబుతూ వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా లో అయిదు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. పవన్ తాజా నిర్ణయంతో నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఖాయం అయింది.

నెక్స్ట్ మంత్రిగా
ఇదే సమయంలో అనూహ్యంగా మరోసారి నాగబాబుకు ఎమ్మెల్సీ సీటు ఖాయం కావటంతో ఇక తరువాత మంత్రి అవ్వనున్నారనే ప్రచారం మరోసారి తెర మీదకు వచ్చింది. నాగబాబును రాజ్య సభకు పంపుతారని.. నామినేటెడ్ పదవి ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ సమయంలో వీటికి సమాధానంగా పవన్ ఈ ప్రకటన చేసారు. నాగబాబును నామినేషన్ కు సిద్దం కావాల్సిందిగా పవన్ ఆదేశించారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు కూటమి నుంచి ఖరారు అయిన తరువాత అయిదుగురు సభ్యులు ఒకే సమయంలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అయిదుగురు ఏక గ్రీవంగా పెద్దల సభకు ఎంపిక కానున్నారు. దీంతో.. నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీగా.. త్వరలోనే మంత్రి అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+