ఢిల్లీ పర్యటన వేళ పవన్ కీలక నిర్ణయం..!!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్రంగా ఏపీ రాజకీయం నడుస్తోంది. పిఠాపురంలో పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతల పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా పల్నాడులో జగన్ తన కంపెనీల కోసం తీసుకున్న భూముల పైన పవన్ ఫోకస్ చేసారు. ఇక, ఆకస్మికంగా ఈ రోజు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ మరింత ఆసక్తి పెంచుతోంది. ఇదే సమయంలో పవన్ తన నియోజకవర్గం పిఠాపురం కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
పవన్ తాజా నిర్ణయం
పవన్ కల్యాణ్ రెండు రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ ను పెంచాయి. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పవన్ తాజాగా పల్నాడు జిల్లాలో పరిశీలించిన జగన్ సంస్థల భూముల అంశం పైన ప్రస్తావన చేయనున్నారు. రైతుల నుంచి జగన్ బలవంతంగా భూములు తీసుకున్నారనేది పవన్ ఆరోపణ. నేటి మంత్రివర్గ సమావేశంలో పవన్ ఈ అంశాలను వివరించి.. చేయనున్న ప్రతిపాదన ఆసక్తి కరంగా మారింది. అదే విధంగా ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న పవన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా కొత్త అంచనాలు తెర మీదకు వస్తున్నాయి.

12 ఎకరాల స్థలంలో
ఇదే సమయంలో తన నియోజకవర్గం పిఠాపురం కేంద్రంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పిఠాపురంలో గెలిచిన తరువాత అక్కడే తాను నివాసం ఏర్పాటు చేసుకుంటానని పవన్ ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చారు. అందులో భాగంగా గెలిచిన తరువాత జూలై నెలలో ఇల్లింద్రాడ, భోగాపురంలో వరుసగా 2.08, 1.44 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇప్పుడు తాజాగా పిఠాపురంలోనే మరో 12 ఎకరాల స్థలం పవన్ కొనుగోలు చేయటం ద్వారా.. ఇక పిఠాపురంలో పక్కా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థలంలో కొత్తగా ఇంటి నిర్మాణంతో పాటుగా తన క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ కొత్త కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ పూర్తి చేసారు.
పెరిగిన ధరలు
పిఠాపురం పరిధిలోని ఇల్లింద్రాడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నం. 13, 28, 29 పరిధిలోని 12 ఎకరాలను పవన్ కొనుగోలు చేశారు. దులో రెండు ఎకరాల స్థలంలో క్యాంపు ఆఫీసు, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ తాజాగా భూములు కొనుగోలు చేసిన ప్రాంతంలో మార్కెట్ విలువ 15 నుంచి 16 లక్షల వరకు ఉంటుందని అంచనా. పిఠాపురంలో పవన్ గెలిచిన తరువాత అక్కడ భూముల కొనుగోలు ద్వారా తమ భూముల ధరలు మరింత పెరిగాయని స్థానికులు చెబుతున్నారు. తాజాగా కొనుగోలు చేసిన స్థలంలో పవన్ ఎలాంటి ప్లాన్ తో ముందుకు వెళ్తారనేది మరో వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications