ఎన్డీఏలోకి టీవీకే విజయ్, పవన్ కల్యాణ్ కీలక మంత్రాంగం..!?
తమిళనాడు రాజకీయాల్లో పవన్ కీలక మంత్రాగం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ తొలి సారి బరిలోకి దిగుతున్న ప్రముఖ హీరో విజయ్ పార్టీ టీవీకే ను ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు పవన్ రంగంలోకి దిగారు. తన సహచర నటుడు విజయ్ తో ఈ మేరకు మంత్రాంగం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరూర్ తొక్కిసలాట కేసులో సీబీఐ రెండో సారి నోటీసుల వేళ.. ఢిల్లీకి వెళ్తు న్న విజయ్.. అక్కడ ఎన్డీఏ కీలక నేతలతో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం లో పవన్ కీలక భూమి పోషిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ ముఖ్యమంత్రి పవన్ తమిళనాడు రాజకీయాల్లో కీలక సమీకరణాలకు తెర తీసారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తమిళనాడు లో ముక్కోణపు పోటీ నెలకొంది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం అన్నా డీఎంకేతో జత కట్టింది. అధికారంలో ఉన్న డీఎంకే తిరిగి తమదే అధికారం అనే ధీమాతో ఉంది. భారీ ప్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీవీకే అధినేత విజయ్ తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ను దగ్గరకు చేసుకునేందుకు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ కూటమిలు ప్రయత్నాలు చేసాయి. అయితే, విజయ్ మాత్రం తాను సింగిల్ గానే పోటీ చేస్తానని పదే పదే చెబుతూ వచ్చారు. ఇక.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ లెక్కలు మారుతున్నాయి. అన్నా డీఎంకేలో పని చేసిన పన్నీర్ సెల్వం ఇప్పుడు డీఎంకే గూటికి చేరారు. డీఎంకే తిరిగి అధికారంలోకి ఖాయమనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.

విజయ్ ఢిల్లీ పర్యటన వేళ కీలక పరిణామాలు
దీంతో, బీజేపీ నాయకత్వం ఏపీ డిప్యూటీ సీఎం.. ఎన్డీఏ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ ను రంగంలోకి దింపింది. గతంలోనూ విజయ్ పార్టీ ఏర్పాటు పైన పవన్ సానుకూలంగా స్పందించారు. అటు డీఎంకే నాయకత్వం పైన మాత్రం పలు విమర్శలు చేసారు. తమిళనాడు ఎన్నికల్లో ఎన్డీఏ కు అనుకూలంగా పవన్ ప్రచారం చేస్తారనే వాదన ఉంది. ఈ సమయంలోనే విజయ్ తో పవన్ ఎన్డీఏ లోకి ఆహ్వానిస్తూ చర్చలు చేసినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అటు జనసేన.. ఇటు టీవీకే వర్గాలు మాత్రం ఎక్కడా ఈ అంశాన్ని నిర్ధారించటం లేదు. ఇక, కరూర్ తొక్కిసలాట కేసులో రెండో సారి సీబీఐ నోటీసులు అందుకున్న విజయ్ రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలోనే ఎన్డీఏలోని ముఖ్య నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పవన్ సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో... ఇప్పుడు పవన్ - విజయ్ ఈ వార్తల పైన ఎలాంటి స్పష్టత ఇస్తారు... విజయ్ ఎన్డీఏలోకి వెళ్లటం ఎంత వరకు జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications