కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమా ప్రాజెక్టుల పై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చారు. కొత్త సినిమాలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని.. చర్చలు జరుగుతున్నాయని కొద్ది రోజులుగా వార్తల్ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రకటన పవన్ ఫ్యాన్స్ లో వైరల్ అవుతోంది. దీంతో.. పవన్ తాజా నిర్ణయంతో తదుపరి అడుగుల పైన ఆసక్తి నెలకొంది.
పవన్ కల్యాణ్ కొత్త సినిమాల పైన ఆయన టీం క్లారిటీ ఇచ్చింది. కొత్త ప్రాజెక్టుల్లో భాగంగానే పవన్ తాజాగా మోహన్ రాజా, దేవా కట్టాతో చర్చలు కూడా జరుపుతున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు సంతకం చేయలేదని, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన ఇప్పట్లో లేదని ఆయన బృందం 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' అధికారికంగా స్పష్టం చేసింది. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్‌మెంట్స్‌ను తీసుకోవడం లేదు. కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏం లేదు. అలాంటిది ఏదైనా అప్‌డేట్ ఉంటే అధికారిక ఛానళ్ల ద్వారా మీకు చేరవేస్తాం. ఓజీ 2 విషయంలో ఏదైనా అప్‌డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా తెలియజేస్తారని వెల్లడించింది.

ఇక ఎక్కువ సమయం పాలన.. పార్టీకే కేటాయింపు
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పటికే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో సినిమాకు సంతకం చేశాడని తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుదనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు అభిమానులు మాత్రం అన్నీ సరైన టైంలో పవన్ కల్యాణ్ ఓజీ 2 ట్రాక్‌లోకి తీసుకువస్తా డని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ నుంచి నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ ముందు వరుసలో ఉండబోతుందన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం గా ఉండటం తో ఇక ఎక్కువ సమయం పాలనా వ్యవహారాలు.. పార్టీ పైనే ఫోకస్ చేయాలని పవన్ భావిస్తున్నట్లు గా తెలుస్తోంది. లోక్ సభ, అసెంబ్లీ సీట్లు 50 శాతం మేర పెంచాలని కేంద్రం డిసైడ్ అయింది. దీంతో, వచ్చే ఎన్నికల్లో జనసేనకు పొత్తులో భాగంగా పెద్ద సంఖ్యలో సీట్లు దక్కనున్నాయి. దీంతో.. రాజకీయంగా ఎక్కువగా సమయం కేటాయించి.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పవన్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications