మా నాయకుడు గ్లామరస్ హీరో: పవన్‌ కల్యాణ్‌ను సోము వీర్రాజు తిట్టారా? పొగిడారా?..!!

పవన్ కల్యాణ్‌పై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లామరస్ హీరోగా అభివర్ణించారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతోన్నప్పటికీ- ఇంకా పవన్ కల్యాణ్‌ను హీరోగానే చూడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాజమహేంద్రవరం: రాష్ట్ర రాజకీయాలన్నీ ప్రస్తుతం పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినహా.. మిగిలినవన్నీ మిత్రపక్షాల కోసం ఎదురు చూస్తోన్నాయి. తమతో కలిసి వచ్చే పార్టీల కోసం మంతనాలు, సంప్రదింపులు సాగిస్తోన్నాయి. ప్రత్యేకించి- తెలుగుదేశం పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఏ మాత్రం లేవు టీడీపీకి. జనసేనతో పొత్తు ప్రయత్నాలు సాగిస్తోంది. బీజేపీని కలుపుకొని వెళ్లాలని భావిస్తోంది.

 ప్రస్తుతానికి బీజేపీతో..

ప్రస్తుతానికి బీజేపీతో..

పవన్ కల్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. దీనికి అవసరమైన వాహనాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. వారాహిలో ఆయన అన్ని నియోజకవర్గాలనూ చుట్టేయనున్నారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు కూడా చేయించారు. త్వరలోనే ఆయన రోడ్డెక్కనున్నారు. ఒకట్రెండు రోజుల్లో బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ ఖరారు కానుంది.

 కీలక వ్యాఖ్యలు..

కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ పర్యటనలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తాను బీజేపీతోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. బీజేపీ వద్దనుకుంటే సొంతంగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవనీ తేల్చి చెప్పారు. 2014 నాటి కాంబినేషన్ గురించి తాను ఇప్పుడే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని, అది జాతీయ స్థాయిలో తీసుకునే నిర్ణయంగా అభివర్ణించారు.

 కన్‌ఫర్మ్ చేసిన సోము..

కన్‌ఫర్మ్ చేసిన సోము..

తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇదే విషయాన్ని ధృవీకరించారు. పవన్ కల్యాణ్ తమతో పొత్తులోనే ఉన్నారని స్పష్టం చేశారు. తాను బీజేపీతో పొత్తులో లేనని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటిస్తే- అప్పుడు దీని గురించి ఆలోచించవచ్చని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్రకు తాము ప్రత్యేకించి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొన్నారు. ఆయనకు ఎప్పుడు తమ అండగా ఉంటుందని వివరించారు.

ఎవరి యాత్రలు వారివే..

ఎవరి యాత్రలు వారివే..

బీజేపీ, జనసేన లక్ష్యం ఒక్కటే అయినప్పుడు పొత్తులు తెగిపోయే ప్రసక్తే లేదని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఎవరి రాజకీయ కార్యకలాపాలు, యాత్రలు వారివేనని, అలాంటప్పుడు మద్దతు ప్రకటించే అవకాశం లేదని చెప్పారు. గతంలో తాము జనపోరు యాత్రలను చేశామని, అప్పుడు పవన్ కల్యాణ్ తమకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు.

గ్లామరస్ హీరో..

గ్లామరస్ హీరో..

పవన్ కల్యాణ్ గ్లామరస్ హీరో కాబట్టి.. ఆయన ఎవ్వరినైనా కలవొచ్చు.. ఆయనను ఎవ్వరైనా కలవొచ్చునని, ఇందులో తప్పేమీ లేదని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఉన్న పొత్తులు వేరు.. మర్యాదపూరకంగా కలుసుకోవడం వేరు అని పేర్కొన్నారు. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోనప్పుడు పొత్తుల తెగదెంపులకు అవకాశమే లేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ఇంకా హీరోగానే..

ఇంకా హీరోగానే..

పవన్ కల్యాణ్ ను సోము వీర్రాజు గ్లామరస్ హీరోగా అభివర్ణించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారారాయన. తెలుగుదేశం పార్టీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో పవన్ కల్యాణ్ పాత్రను ఎవ్వరూ విస్మరించలేరు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో అన్ని అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు పోటీ చేశారు. అయినప్పటికీ ఆయనను హీరోగానే బీజేపీ గుర్తిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+