వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాపై దాడి జరిగితే తీవ్రప్రభావం, మీదే బాధ్యత: పవన్ సంచలనం, హెచ్చరిక లేఖ ఇదే!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జనసేన బహిరంగ సభ : ప్రజల్లో హాట్ టాపిక్

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ డీజీపీ మాలకొండయ్యకు లేఖ రాసిన విషయం తెలిసిందే. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా బుధవారం జరగనున్న పార్టీ ఆవిర్భావ సభకు భద్రత కల్పిస్తున్నందుకు థ్యాంక్స్ తెలిపారు.

చదవండి: మీ అన్నయ్య పార్టీని అడుగు, జగన్ బతికించారు, ఇన్నాళ్లేం చేశావ్: పవన్ డైలాగ్‌తో రోజా

అలాగే తనకు సభ తర్వాత కూడా భద్రత కొనసాగించాలని అందులో కోరారు. తనపై దాడి జరిగితే ప్రజా జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేస్తూ లేఖ రాశారు. లేఖలో ఇలా ఉంది.

చదవండి: 'చంద్రబాబుకు చెంపపెట్టు, అందరూ రాజీనామా చేయాలి, 21న కలిసిరండి'

నా భద్రత సున్నిత రాజకీయ సమస్యతో ముడివడి ఉంది

నా భద్రత సున్నిత రాజకీయ సమస్యతో ముడివడి ఉంది

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనకు భద్రత కొనసాగించాలని కోరారు. తాను భద్రత కోరుతోంది ప్రదర్శనా కుతూహలంతో కాదని, ప్రస్తుతం సమాజంలో ఉన్న ఉద్యమాల కారణంగా తన భద్రత సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యలతో ముడివడి ఉందని తెలిపారు.

నాపై దాడి జరిగితే

నాపై దాడి జరిగితే

తనపై ఏదైనా దాడి జరిగితే అది ప్రజాజీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో భీమవరంపట్నంలో తన ఫ్లెక్సీని చించేసినందుకు దాదాపు రెండువేల మంది తన అభిమానులు ధర్నా చేశారని, దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గుర్తు చేశారు.

బాబును కలిసేందుకు వెళ్తే ప్రజలు ఇబ్బందిపడ్డారు

బాబును కలిసేందుకు వెళ్తే ప్రజలు ఇబ్బందిపడ్డారు

అలాగే కాకినాడలో తన సభ ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాట, విజయవాడలో ఉద్దానం బాధితుల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తాను కలిసేందుకు వెళ్లినప్పుడు దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించి ప్రజలు ఇబ్బంది పడ్డారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.

అందుకే భద్రత కోరుతున్నాను

అందుకే భద్రత కోరుతున్నాను

ఆ తర్వాత ఇటీవల తాను అనంతపురంలో పర్యటించిన సమయంలో తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనలను దృష్టిలో పెట్టుకొని తాను భద్రతను కోరుతున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు.

లేదంటే మీరే బాధ్యత వహించాలి

లేదంటే మీరే బాధ్యత వహించాలి

తనకు భద్రత అందించేందుకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే.. తాను రాష్ట్రంలో పర్యటిస్తుండగా తనకు సంబంధించి అనివార్య సంఘటనలు జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాబట్టి పై విషయాలను సానుభూతితో పరిశీలించాలని, తన విన్నపాన్ని మన్నించాలని చివరలో కోరారు.

మార్చి 14 తర్వాత కొనసాగించండి

తన రాష్ట్ర పర్యటన సమయంలో అనివార్య సంఘటనలు జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెబుతూ.. మార్చి 14వ తేదీ తర్వాత కూడా తనకు అందిస్తున్న వ్యక్తిగత భద్రతను కొనసాగించాలని కోరారు.

ప్రచారం ఎవరూ నమ్మకండి

మరోవైపు, జనసేన పార్టీ కమిటీలపై వచ్చిన వార్తలు అవాస్తవమని ఆ పార్టీ ఖండించింది. పార్టీ కమిటీల నియామకంపై కసరత్తు కొనసాగుతోందని తెలిపింది. త‌మ‌ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొంది. ఇటువంటి ప్రచారాలన్నీ ఎవరూ నమ్మొద్ద‌ని, ఏళ్ల తరబడి కష్టపడుతున్న నిజమైన కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందని పేర్కొంది. పార్టీ శ్రేణులు ఎటువంటి గందరగోళానికి గురికావొద్దని సూచించింది.

English summary
Jana Sena party president Pawan Kalyan today requested police to extend his personal security cover to prevent untoward incidents,lest the state government be held responsible for any eventuality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X