ఆ బాధతోనే దూరంగా ఉంటున్నా- పవన్ కీలక వ్యాఖ్యలు..!!
డిప్యూటీ సీఎం పవన్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వంలో జరుగుతున్న సమావేశాలకు కొద్ది రోజులుగా పవన్ దూరంగా ఉంటున్నారు. తాను పవన్ ఆరోగ్యం పై వాకబు కోసం ఫోన్ చేసినా పవన్ అందుబాటులోకి రాలేదని స్వయంగా చంద్రబాబు చెప్పారు. ఆ మరుసటి రోజునే పవన్ దక్షిణాది రాష్ట్రాల్లో ఆలయాల సందర్శనకు వెళ్లారు. ఇప్పుడు కూటమిలో సమన్వయం.. సమావేశాలకు తాను దూరంగా ఉండటానికి కారణాలను పవన్ వెల్లడించారు. కీలక అంశాలను వివరించారు.
అసలు విషయం
పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా ప్రభుత్వంలోని కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. మంత్రివర్గ భేటీతో పాటుగా మంత్రులు - కార్యదర్శుల సమావేశానికి పవన్ హాజరు కాలేదు. కేబినెట్ భేటీలో మంత్రుల ర్యాకింగ్స్ పైన పవన్ పదో స్థానంలో ఉండటం పైన చర్చ జరిగింది. కార్యదర్శులతో జరిగిన సమావేశంలో పవన్ ఆరోగ్యం గురించి మంత్రి మనోహర్ ప్రస్తావన చేసారు. తాను పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించానని.. అందుబాటులోకి రాలేదని సీఎం చంద్రబాబు ఆ సమావేశం లోనే చెప్పుకొచ్చారు. ఇక, పవన్ వరుసగా దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాల సందర్శనకు వెళ్లారు.

పవన్ క్లారిటీ
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ కు పవన్ హాజరయ్యారు. అక్కడ చంద్రబాబు, లోకేష్ తో సహా నందమూరి బాలయ్యతోనూ సరదాగా కనిపించారు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడ నూతన సీఎం ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ సైతం అదే వేదిక పైన పవన్ ఆహార్యాన్ని చూసి అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లున్నారా అంటూ చమత్కరించారు. ఇంకా సమయం ఉందంటూ పవన్ చెప్పటంతో అందరిలోనూ నవ్వులు కనిపించాయి. ఇక, తాను ఈ సమావేశాలకు దూరంగా ఉండటం పైన పవన్ స్పష్టత ఇచ్చారు. ఏపిలో సమన్వయంతోనే కలిసి ముందుకు వెళుతున్నామని పవన్ స్పష్టం చేసారు.
అందుకే దూరంగా
తాను వెన్ను నొప్పి కారణంగానే ఏపిలో కొన్ని సమావేశాలకి హాజరు కాలేకపోయానని వివరించారు. ఇప్పటికి వెన్న నొప్పి తీవ్రంగా బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చటంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని వివరించారు. అయినా.. చ్చిన హామీల అమలు చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని వెల్లడించారు. పర్యావరణ, అటవీ శాఖలు తనకు చాలా ఇష్టమైన శాఖలుగా చెప్పిన పవన్.. నిబద్ధతతో తన మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా పవన్ ఏపీలో కూటమిలో తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని పవన్ స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications