pawan kalyan కొత్త కార్యక్రమం... "టీ విత్ డిప్యూటీ సీఎం"

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్, జూ పార్కులో అభివృద్ధిలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్పోరేట్ సంస్థలను ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

జూ పార్కుల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ఫోకస్
జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో పాల్గొని, జూల అభివృద్ధికి కీలక సూచనలు చేసిన ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జంతుప్రదర్శనశాలలు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం, తిరుపతి లలో జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు.

Pawan kalyan new program Tea with Deputy CM for zoo parks development in ap

జూ పార్కుల అభివృద్ధికి పవన్ సూచనలు
రాష్ట్రంలో నూతన జంతుప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు పవన్ కళ్యాణ్.అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చుకోవాలని అన్నారు.

అరుదైన జంతువులను దిగుమతి చేసుకోండి
అరుదైన, ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి వైల్డ్ లైఫ్ అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

టీ విత్ డిప్యూటీ సీఎం ... పవన్ మరో సంచలన కార్యక్రమం
పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకుంటారని, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. "టీ విత్ డిప్యూటీ సీఎం" ద్వారా వారితో తను మాట్లాడతానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+