వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుట్టిన రోజు ఎందుకు జరుపుకోనంటే?: పవన్ వివరణ, ‘2019’లో పోటీపై ఇలా..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పుట్టిన రోజు ఎందుకు జరుపుకోననే విషయంపై స్పందించారు. అంతేగాక, జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆయన వివరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పుట్టిన రోజు ఎందుకు జరుపుకోననే విషయంపై స్పందించారు. అంతేగాక, జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆయన వివరించారు.

పుట్టిన రోజు ఎందుకు జరుపుకోనంటే..

పుట్టిన రోజు ఎందుకు జరుపుకోనంటే..

పుట్టిన రోజు జరుపుకోవడం తనకు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము 8మంది సంతానం అని, అందులో ముగ్గురు చనిపోయారని అన్నారు. తమది లిమిటెడ్ ఇన్కమ్ ఉన్న కుటుంబం కాబట్టి చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాము పుట్టిన రోజు జరుపుకోలేదని చెప్పారు. అదే కంటిన్యూ అయ్యిందని చెప్పారు. అయితే, ఇంట్లో తమకు ఇష్టమైనదేదో చేసి పెడితే తినేవాడినని చెప్పారు. పుట్టిన రోజు కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, భగవంతుడి ఆశీస్సులు కోరుకుంటామని చెప్పారు. అంతేగాక, తనకు పుట్టిన రోజులు జరుపుకోవడమంటే తనకు కొంచెం సిగ్గు అని చెప్పారు. కొంత కాలం వరకు తన పుట్టిన రోజు కూడా మర్చిపోయానని చెప్పారు. బతికి ఉన్నన్నీ రోజులు కూడా పుట్టిన రోజులేనని అన్నారు.

2019 ఎన్నికల్లో పోటీపై ఇలా..

2019 ఎన్నికల్లో పోటీపై ఇలా..

2019 ఎన్నికల వరకు తమ బలం ఎంత ఉందో చూసి తెలంగాణతోపాటు ఏపీలో ఒంటరిగా పోటీ చేసే విషయంపై ఆలోచిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ బలాన్ని బట్టి ఎన్ని సీట్లలో పోటీ చేయాలో అంచనాకు వస్తామని, ఇందులో ఎలాంటి సీక్రెట్ లేదని పవన్ స్పష్టం చేశారు.

దక్షిణాదిపై చిన్నచూపు..

దక్షిణాదిపై చిన్నచూపు..

దక్షిణాదిపై చిన్న చూపు అనే వ్యాఖ్యలు తాను ఎందుకు చేశానో కూడా పవన్ వివరించారు. తెలంగాణ, సమైక్య ఉద్యమాల్లో ఎందరో యువకులు చనిపోయినా ఉత్తరాది మీడియా ఎంత మాత్రం పట్టించుకోలేదని.. కానీ, ఉత్తరాదిలో చిన్న ఘటన జరిగినా పెద్దగా చూపిస్తారని అన్నారు. బెంగళూరు, దుబాయ్ లోని పలువురు అభిమానులతో కూడా పవన్ మాట్లాడారు.

మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..

మహిళలు అద్భుతాలు సృష్టిస్తారు..

స్త్రీలు మగాడి వెనుక, ముందు కాదు పక్కన నడవాలని పవన్ అన్నారు. జనసేనలో మహిళలకు అలాంటి గౌరవం ఉంటుందని పవన్ చెప్పారు. మహిళలకు మద్దతిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పవన్ స్పష్టం చేశారు.

English summary
Cine Actor and Janasena president Pawan Kalyan responded on his birthday issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X