రాజకీయ ఒత్తిళ్లున్నా.. ! ధన్ కడ్ ఆకస్మిక రాజీనామాపై పవన్ సంచలన ట్వీట్..!
ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ఆకస్మిక రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిన్న సాయంత్రం వరకూ రాజ్యసభను నడిపి రాత్రికి సడన్ గా అనారోగ్య కారణాలతో అంటూ పదవికి రాజీనామా చేసేసిన వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పదవీకాలంలో ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా ఆయన వ్యవహరించిన తీరుపైనా చర్చ నడుస్తోంది. ఇదే క్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఉపరాష్ట్రపతి రాజీనామాపై స్పందించారు.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ జీ మీరు దేశానికి అంకితభావంతో, విలువైన సేవ చేసినందుకు ధన్యవాదాలంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. మీ పదవీకాలం అంతా, మీరు ఉపరాష్ట్రపతి కార్యాలయ గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారని పవన్ కొనియాడారు. రాజ్యాంగ విలువలను కాపాడుకున్నారని, దయ, నిష్పాక్షికత, సమగ్రతతో పనిచేశారంటూ కితాబిచ్చారు. రాజకీయ ఒత్తిడి లేకుండా మీ నిర్భయమైన అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజా జీవితానికి ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశించిందంటూ ధన్ కడ్ ను ఆకాశానికెత్తేశారు.

ఉపరాష్ట్రపతి పదవి నుంచి తప్పుకుంటున్న వేళ ధన్ కడ్ కు మంచి ఆయురారోగ్యాలు, సంతోషం ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అలాగే భవిష్యత్తులో ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ ధన్ కడ్ కు పవన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ధన్యవాద్, జగదీప్ ధంఖర్ జీ అంటూ పవన్ తన ట్వీట్ ముగించారు. వాస్తవానికి ధన్ కడ్ ఉపరాష్ట్రపతిగా ఉండగా ఏనాడూ ఆయన గురించి మాట్లాడని పవన్.. ఇప్పుడు రాజీనామా తర్వాత స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Thank you, Respected Vice President of India @VPIndia, Sri Jagdeep Dhankhar Ji, for your dedicated and valuable service to Bharat.
— Pawan Kalyan (@PawanKalyan) July 22, 2025
Throughout your tenure, you upheld the dignity of the Vice President’s office with unwavering commitment, safeguarded constitutional values, and… pic.twitter.com/Cl4EYelwuy
జనసేన పార్టీకి రాజ్యసభలో ఎంపీలు లేకపోవడంతో ధన్ కడ్ ను కలిసే అవకాశం కూడా పవన్ కళ్యాణ్ కు లభించలేదు. అయితే గతంలో ఎన్డీయే పార్టీ బీజేపీ నేతగా, పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన ధన్ కడ్ ను పవన్ ఢిల్లీలో వివిధ సందర్భాల్లో మర్యాదపూర్వకంగా పలకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ధన్ కడ్ ఆకస్మిక రాజీనామా వెనుక ఏదో జరిగిందన్న చర్చ నేపథ్యంలో ఎన్డీయే కూటమి ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి సమయంలో పవన్ ధన్ కడ్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేయడంపై చర్చ జరుగుతోంది.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..!












Click it and Unblock the Notifications