లడ్డూ కల్తీలో వారిని వదిలేది లేదు - పవన్ హెచ్చరిక..!!

తిరుమల లడ్డూ వివాదం పై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. ఈ ఘటన పై విచారం వ్యక్తం చేసారు. దీని పైన గత టీటీడీ పాలకవర్గం సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. లడ్డూ విషయంపై టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. అలాగా దీనికి సంబంధించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వివాదం వెనుక ఎవరున్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

పవన్ విచారం
తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించారనే సమాచారం ఇప్పుడు సంచలనంగా మారింది. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశం పైన స్పందించారు. టీటీడీ మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి ఎలాంటి పొరపాటు జరగలేదని..తాను దేవదేవుడి ముందు ప్రమాణానికి సిద్దమని ప్రకటించారు. మరో మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సైతం అలా ఎవరైనా చేసి ఉంటే నాశనం అయిపోతారని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల క్షేత్రం పైన ప్రచారం చేయటం సరికాదన్నారు.

Pawan Kalyan reacts over Tirumala Laddu controvesy made interesting comments

చర్యలు తప్పవు
ఇక, తాజాగా లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలోని పదార్దాల పైన లాబ్ ఇచ్చిన నివేదిక సంచలనంగా మారింది. దీని పైన విచారణ చేస్తామని..టీటీడీ పవిత్రత కాపాడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ సైతం అదే అంశాన్ని స్పష్టం చేసారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అంటే చేపనూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు కలపడం బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. దేశ వ్యాప్తంగా దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

జాతీయ స్థాయిలో
సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ బోర్డు ఏర్పాటుపై చర్చలు జరగాలన్నారు. ఇందులో దేవాలయాల అపవిత్రత, భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్దతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేలా ఉండాలన్నారు. అలాగే సనాతన ధర్మ రక్షణ బోర్డు విషయంపై జాతీయ స్థాయిలో చర్చించాలన్నారు. సనాతన ధర్మాన్ని అందరం కాపాడేందుకు కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+