ప్రజల మంచి కోరే పాలన ఇదేనా - ఫైనాన్స్ వ్యాపారుల్లా : పవన్ కళ్యాణ్ ఫైర్..!!
పార్టీ ఆవిర్భావ సదస్సులో సంచలన వ్యాఖ్యలతో రాజకీయ వేడి పుట్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. కాకినాడలో పన్నులు చెల్లించకపోతే వాహనాలు జప్తు చేస్తామంటూ మున్సిపల్ అధికారులు వాహనాలకు ఫ్లెక్సీలు కట్టి తిప్పటం ఇప్పుడు వివాదాస్పదం అయింది. దీని పైన జిల్లా స్థాయిలోనూ రాజకీయ నేతలు స్పందించారు. పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ అంశం పైన జనసేన అధినేత రియాక్ట్ అయ్యారు. ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు అంటూ పవన్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉందంటూ ఎద్దేవా చేసారు. మున్సిపల్ అధికారులు ప్రకటన చేయటంతో పాటుగా జప్తు కోసం వాహనాలను రంగంలోకి దించటం ప్రజాగ్రహానికి కారణమైంది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించని ఇంటి యజమానుల సామాన్లు తీసుకుపోవు జప్తు వాహనము అంటూ రాసి ఉన్న ఫ్లెక్సీలను నగరంలో తిరిగాయి.

దీని పైన పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో మున్సిపల్ అధికారులు వెనక్కు తగ్గారు. వాటిని నిలుపుదల చేసారు. అయితే, కాకినాడ రాజకీయాల పైన పవన్ తన పార్టీ ఆవిర్భావ సదస్సులో మాట్లాడారు. తన పైన కాకినాడ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే, తాను వాటికి రియాక్ట్ కాలేదన్నారు. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే భీమ్లా నాయక్ ట్రీట్ మెంట్ తప్పదని హెచ్చరించారు.
ప్రజల మంచి కోరి పరిపాలన చేస్తున్నట్లు ఏ కోశానా కనిపించడం లేదు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోంది? డెయిలీ ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ ఆలోచనలా ఉంది. pic.twitter.com/MIuGWaJeyN
— Pawan Kalyan (@PawanKalyan) March 18, 2022
Recommended Video

ఆ సభ తరువాత పవ్ వ్యాఖ్యల పైన వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి సైతం పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక, మంత్రులు అవంతి శ్రీనివాస రావు..వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం తమ పైన చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా పవన్ పైన ఫైర్ అయ్యారు. ఇక, ఇప్పుడు పవన్ చేసిన ట్వీట్ పైన అధికార పార్టీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.












Click it and Unblock the Notifications