సండే నైట్ సర్‌ప్రైజ్ చేసిన పవన్ కళ్యాణ్, క్షణాల్లో...
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం రాత్రి అభిమానులకు, నగరవాసులకు హైటెక్ సిటీ ప్రాంతంలో సర్‌ప్రైజ్ ఇచ్చారు! అనుకోని విధంగా ఆయన నగర వీధుల్లో కనిపించేసరికి ఆయన ఫోటోలు తీసుకునేందుకు పలువురు పోటీ పడ్డారు. వెంకటేష్, పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం గోపాల గోపాలా షూటింగులో ఉన్న విషయం తెలిసిందే.

ఆదివారం పవన్ కళ్యాణ్ షూటింగులో పాల్గొన్నాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి ఒంటిగంట అవుతోంది. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న వారికి షూటింగులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కనిపించాడు. ఆ వార్త క్షణాల్లో పాకిపోయింది. దీంతో అభిమానులు, చుట్టుపక్కల జనాలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆ సన్నివేశాలను తమ కెమెరాల్లోకి ఎక్కించేందుకు ఉత్సాహపడ్డారు.
టాలీవుడ్లో సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఆయన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ, తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీల కూటమికి మద్దతు పలికారు.












Click it and Unblock the Notifications