• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బైబిల్ సూక్తులతో మరోసారి పవన్ - టార్గెట్ సీఎం జగన్ : సంపూర్ణంగా మద్యం మీదే..!!

|
Google Oneindia TeluguNews

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి సీఎం జగన్ ను టార్గెట్ చేసారు. ఈ మధ్య కాలంలో సీఎం జగన్ నిర్ణయాలనకు వరుసగా తప్పు బడుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మద్యం ఆదాయం పైన బాండ్ల అమ్మకం నిర్ణయం తీసుకోవటం పైన ట్వీట్ చేసారు. దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయాల మేర ఆదాయం సమకూర్చటం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల పైన పవన్ కళ్యాణ్ ట్వీట్ లో సెటైరికల్ గా స్పందించారు. అదే సమయంలో బైబిల్ సూక్తిని ప్రస్తావించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

కొద్ది రోజుల క్రితం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ జగన్ బైబిల్ చదువుతారు కానీ, అందులోని సూక్తులు పాటించరంటూ ఎద్దేవా చేసారు. తాను చిన్నప్పుడు తన టీచర్ చెప్పిన బైబిల్ సూక్తి మేరకు తగ్గటం నేర్చకున్నానని వివరించారు. ఇక, ఇప్పుడు తాజాగా చేసిన ట్వీట్ లో ..రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. దీనికి ... అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లోజోడించారు. జగన్ పైన రాజకీయంగా టార్గెట్ చేస్తూనే.. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో తరచూ బైబిల్ సూక్తులను ప్రస్తావించటం.. జగన్ తో లింకు పెట్టటం ఏంటనే చర్చ మొదలైంది.

Pawan Kalyan target CM JAgan on liquor sales and govt latest decision

గతంలో లేని విధంగా పవన్ కళ్యాణ్ కులాలు - ప్రాంతాల గురించి ఈ మధ్య కాలంలో తరచూ ప్రస్తావిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలను రాజకీయంగా ఇక వైసీపీ మరిచిపోవచ్చంటూ చెప్పుకొచ్చారు. పొత్తుల పైన మూడు ఆప్షన్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్..ఇప్పుడు బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు. తన మూడు ఆప్షన్ల పైన ఇప్పటి వరకు టీడీపీ నుంచి అధికారిక స్పందన లేదు. అటు చంద్రబాబు జిల్లాల యాత్ర చేస్తున్న సమయంలోనే.. పవన్ సైతం బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు. దీంతో..ఏపీ రాజకీయాలు ఇప్పుడు సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మరి..వైసీపీ ఈ విమర్శల పట్ల ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

English summary
Janasena Chief Pawan Kalyan satires on govt decision on prohibition of liquor and latest bonds sale for revenue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X