పవన్ Vs జగన్ - మరో యుద్దం, సిద్దం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తవుతోంది. వైసీపీ లక్ష్యంగా కూటమి నేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ పోరుబాట ప్రకటించారు. వరుస నిరసనలకు సిద్దం అవుతున్నారు. అటు జిల్లాల పర్యటనలకు జగన్ రెడీ అయ్యారు. ఇదే సమయంలో పవన్ కొత్త వ్యూహాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
మారుతున్న లెక్కలు
ఏపీలో కూటమి ప్రభుత్వం పైన ఇప్పటికే జగన్ తన నిరసనల కార్యాచరణ ఖరారు చేసారు. ఈ నెల 11వ తేదీ నుంచి వరుసగా మూడు అంశాల పైన పోరుబాటకు ముహూర్తం ఫిక్స్ అయింది. సంక్రాంతి తరువాత జగన్ వరుసగా పార్లమెంట్ స్థానాల వారీగా పర్యటనలు చేయనున్నారు. ప్రతీ బుధ, గురు వారం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు - కేడర్ తో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే సమయంలో ఇటు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు పైన ఫోకస్ చేసింది. అదే విధంగా పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్దం అవుతోంది.

జనంలోకి జగన్
ఎన్నికల సమయంలో పవన్ వైసీపీ లక్ష్యంగా ప్రచారం కొనసాగించారు. అధికారంలోకి వచ్చిన తరువాత శాంతి భద్రతలు, కాకినాడ నుంచి బయ్యం అక్రమ రవాణా పై పవన్ స్పందించిన తీరు చర్చగా మారింది. పవన్ డిమాండ్ తో చంద్రబాబు వెంటనే చర్యలకు సిద్దమయ్యారు. కేంద్రంలో జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలో జగన్.. అటు పవన్ ప్రజల్లో తమ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రభుత్వంలో ఉంటూనే పవన్ తన అభిప్రాయాలను ఓపెన్ గా చెప్పటం టీడీపీ నేతలకు ఇబ్బందిగా మారుతోంది. పవన్ దూకుడు తో ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ రాజకీయంగా మొదలైంది.
కడపకు పవన్
ఇటు జగన్ ప్రజల్లోకి వెళ్లి తాను ఎన్నికల్లో ఓడినా.. ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవటానికి సిద్దం అయ్యారు. వరుసగా మూడు నెలల కార్యాచరణ ఖరారు చేసారు. కూటమి తో పాటుగా షర్మిల సైతం జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో జగన్ ఇలాకాలో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 7న కడప హైస్కూలో జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. పవన్ పర్యటనకు కడప లో వచ్చే స్పందన పైన ఆసక్తి నెలకొంది. అదే విధంగా జగన్ సైతం ఇక ప్రజల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యారు. దీంతో, ఏపీలో మరోసారి పవన్ వర్సస్ జగన్ పొలిటికల్ ఫైట్ ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications