సభలో తోపులాట, ఆపలేకపోయిన బౌన్సర్లు: పవన్ కళ్యాణ్ కోసం వేసిన వేదిక తీసేశారు!

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఆయనను చూసేందుకు చాలామంది కదలి వచ్చారు. ఈ నేపథ్యంలో భద్రత ఇబ్బందికరంగా మారింది.

చదవండి: చంద్రబాబు వాడుకొని వదిలేస్తాడని తెలుసు, జగన్‌ది తప్పు, అందుకే మద్దతివ్వలేదు: పవన్, వైయస్‌పై..

సీహార్స్‌ కూడలికి పవన్ చేరుకున్న అనంతరం అభిమానులందరూ వేదికకు అత్యంత సమీపానికి వచ్చేయడంతో తోపులాటలు చోటుచేసుకున్నాయి. పవన్ కార్యక్రమాలకు అభిమానులు పెద్దఎత్తున వస్తారన్న ఉద్దేశంతో పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తుకు వచ్చారు.

చదవండి: అన్నయ్యకు చెప్పా, అహంకారం తీసేశా, బీజేపీ హిందూ మతానికి: పవన్ కళ్యాణ్ నోట సంచలనం

తోసుకొని వచ్చిన అభిమానులు

తోసుకొని వచ్చిన అభిమానులు

వీరిలో చాలామంది వేదికకు కాస్త దూరంలో ఉన్నారు. సభ సజావుగా సాగేందుకు వీలుగా అభిమానులను నియంత్రించలేదు. దీంతో కొందరు ఫ్యాన్స్ సబా వేదిక ముందుకు తోసుకొని వచ్చారు. మీడియా కోసం వేసిన కుర్చీల మీద కూడా పడ్డారు. తోపులాటలో కొందరి ఫోన్లు, ఇతర వస్తువులు కిందపడిపోయాయి. కొన్ని పగిలిపోయాయి.

ఆపేందుకు ఇబ్బందిపడ్డ బౌన్సర్లు

ఆపేందుకు ఇబ్బందిపడ్డ బౌన్సర్లు

తోపులాటను నియంత్రించేందుకు పోలీసులు పెద్దగా ముందుకు రాలేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బౌన్సర్లు మాత్రం జనాలను నియంత్రించేందుకు ఇబ్బందిపడ్డారు. వారిని అతి కష్టం మీద వెనక్కి నెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

పవన్ కోసం వేసిన వేదికను తీసేశారు, మళ్లీ

పవన్ కోసం వేసిన వేదికను తీసేశారు, మళ్లీ

వేదికను ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు దానిని తొలగించారని చెబుతున్నారు. దీంతో బుధవారం ఉదయం హడావుడిగా దానిని మళ్లీ వేశారు. కాగా, డీసీఐని ప్రయివేటీకరిస్తే బీజేపీ వెనుకాల నిలబడే ప్రసక్తే లేదని పవన్ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మీ కోసం ఉద్యమిస్తానని చెప్పారు.

వెంకటేష్ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్న పవన్

వెంకటేష్ మృతికి కారణాలు అడిగి తెలుసుకున్న పవన్

డీసీఐ ఉద్యోగులకు బాసటగా నిలిచేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలుత వెంకటేశ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో సమావేశమై వెంకటేశ్‌ మరణానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.

స్థానిక నేతలు రాకపోవడం శోచనీయం

స్థానిక నేతలు రాకపోవడం శోచనీయం

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఉద్యోగి చనిపోతే కనీసం స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు పరామర్శకు కూడా రాకపోవడం శోచనీయమన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తక్షణం వెంకటేశ్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At the heart of the relay hunger strike launched nine days ago by workers of Visakhapatnam-based Dredging Corp of India (DCI) Ltd is the fear that the new owner will sack many of the 1500 workers. More than that is the fear that the corporate office will be shifted from Visakhapatnam to some other city, probably Mumbai, forcing relocation of remaining workers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి