ఏమిటిది, వద్దంటే వద్దు: మోడీకి రాసిన లేఖలో పవన్ కల్యాణ్ ఇలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: డ్రెడ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ని ప్రైవేటీకరించాలనే కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యతిరేకించారు. ఈ మేరకు ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. విశాఖట్నంలో దాని కేంద్ర కార్యాలయం ఉంది.

కేంద్ర ప్రభుత్వం వాటా ప్రస్తుతం ఈ కంపెనీలో 73.47 శాతం ఉందని, షేర్ ప్రైస్ మార్కెట్లో రూ.700 ఉందని ఆయన గుర్తు చేశారు. తన మొత్తం వాటాను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలకు విక్రయించాలనే యోచన చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.

Pawan Kalyan Warns Centre Over DCI and angry on YS Jagan
 అది దేశ భద్రతకు వ్యతిరేకం...

అది దేశ భద్రతకు వ్యతిరేకం...

డిసిఐ డ్రెడ్జింగ్ క్షేత్రంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకుందని, అందువల్ల దాన్ని ప్రైవేటీకరించడం దేశ రక్షణకు, భద్రతకు వ్యతిరేకమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిందని, లాభాల బాటలో నడుస్తున్నఈ సంస్థను బట్టి ప్రభుత్వం ఉద్యోగులను తొలగించడానికి పూనుకుందనేది అర్థమవుతోందని ఆయన అన్నారు.

 ప్రభుత్వ సంస్థల బకాయిల వల్లనే...

ప్రభుత్వ సంస్థల బకాయిల వల్లనే...

ప్రభుత్వ సంస్థలు చెల్లించాల్సిన బకాయిల వల్లనే డిసిఐ ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కుంటోందని, గత బకాయిలను చెల్లిస్తే సంస్థ మరింతి పోటీతత్వంతో పనిచేయగలదని పవన్ కల్యాణ్ అన్నారు. సంస్థను ప్రైవేటీరించాలనే నిర్ణయం వల్ల ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని అంటూ వెంకటేష్ ఆత్మహత్య ఉదంతాన్ని ఆయన గుర్తు చేశారు.

 వారు సరిగా అధ్యయనం చేసినట్లు లేరు

వారు సరిగా అధ్యయనం చేసినట్లు లేరు

సంస్థను ప్రైవేట్ చేయాలని పరిగణనలోకి తీసుకుని ప్రక్రియను ప్రారంభించిన అధికారులు కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని గుర్తించినట్లు లేరని పవన్ కల్యాణ్ అన్నారు. షప్పింగ్ పరిశ్రమలో ఇది అత్యంత ప్రధానమైందని ఆయన అన్నారు. డిసిఐని ప్రైవేటీకరిస్తే రాష్ట్ర విభజనతో తనకు వచ్చిన ప్రధానమైన సంస్థను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోల్పోతుందని ఆయన అన్నారు.

 ప్రారంభం నుంచి లాభాల్లోనే...

ప్రారంభం నుంచి లాభాల్లోనే...

డిసిఐ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు లాభాల బాటలోనే నడుస్తోందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. పన్నులు, డివిడెండ్ రూపాల్లో కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయాన్ని సమకూరుస్తోందని అన్నారు. డిసిఐ ప్రాముఖ్యతను ఆయన తన లేఖలో పాయింట్ల ద్వారా చాలా వివరంగా లేఖలో రాశారు.

 ఈ ఓడరేవుల బాకీలు...

ఈ ఓడరేవుల బాకీలు...

కాండ్ల,, గోవా, కొచ్చిన్ వంటి ఓడరేవులు డిసిఐకి బాకీలు పడ్డాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఏటేటా ఆ బాకీలు పేరుకుపోతున్నాయని అన్నారు. బాకీల సెటిల్‌మెంట్లకు డిస్కౌంట్లు ఇస్తున్నప్పటికీ అవి చెల్లించడం లేదని అన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖ క్లియరెన్స్ కోసం అవి ఎదురు చూస్తున్నాయని అన్నారు.

 పార్లమెంటరీ కమిటీలు సిఫార్సులు ఇచ్చింది...

పార్లమెంటరీ కమిటీలు సిఫార్సులు ఇచ్చింది...

డిసిఐని పటిష్టం చేసి, దానికి చెల్లించాల్సిన బకాయిలపై పార్లమెంటరీ కమిటీలు సిఫార్సులు చేశాయని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆ కమిటీల సిఫార్సులను కూడా లేఖలో పొందుపరిచారు. డిసిఐని ప్రైవేటీకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆన అన్నారు.

 అది చేస్తే సామాజిక న్యాయాన్ని కాదనడమే...

అది చేస్తే సామాజిక న్యాయాన్ని కాదనడమే...

ప్రభుత్వ రంగ సంస్థ కావడం వల్ల డిసిఐలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని, దాన్ని ప్రవైటీకరిస్తే అవి ఉండవని, దాని వల్ల సామాజిక న్యాయానికి విఘాతం కలుగుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. తమ ఉద్యోగాలు పోతాయని ఆ వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయని ఆయన అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jana Sena Chief Pawan Kalyan has written letter to PM Narendra Modi opposing the privatisation of DCI located at Visakhapatnam in Andhra Pradesh.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి