అన్నను టార్గెట్ చేస్తూ పవన్ పేరెత్తని షర్మిల - తెర వెనుక..!!

ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది. పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తూనే తన అన్న సీఎం జగన్ తో పాటుగా చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. కానీ, ఎక్కడా పవన్ గురించి ప్రస్తావన చేయటం లేదు. అదే సమయంలో చంద్రబాబును విమర్శించినా టీడీపీ స్పందించటం లేదు.

మారుతున్న లెక్కలు: ఏపీలో కాంగ్రెస్ పట్టు సాధించే ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ గా షర్మిలకు బాధ్యతలు కేటాయించింది. షర్మిల పార్టీ పగ్గాలు స్వీకరించిన మరుక్షణమే ముఖ్యమంత్రి జగన్ ను రాజకీయంగా టార్గెట్ చేసారు. చంద్రబాబు పైన విమర్శలు చేసారు. షర్మిల విమర్శలను వైసీపీ ముఖ్య నేతలు కౌంటర్ చేసారు.

PCC chief Sharmila criticizing AP CM Jagan and Chandrababu, skip Pawan Kalyan, Why

సీఎం జగన్ తాజాగా ఉరవకొండ సభలో షర్మిల పేరు ప్రస్తావించకుండానే రాష్ట్రాన్ని విడదీసిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమాన సంఘాలు అంటూ కామెంట్ చేసారు. దీని ద్వారా షర్మిల ఏపీలో తనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కలిగేలా వ్యాఖ్యలు చేసారనే వాదన వినిపిస్తోంది.

జగన్, చంద్రబాబు పై విమర్శలు: తాజాగా విశాఖలోనూ షర్మిల మరోసారి సీఎం జగన్, చంద్రబాబును టార్గెట్ చేసారు. ఏపీలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైసీపీ, టీడీపీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబువి కనిపించే పొత్తులు అని, వైసీపీ అధినేత సీఎం జగన్‌వి కనిపించని పొత్తులు అని విరుచుకుపడ్డారు.

బీజేపీతో వైసీపీ, టీడీపీ సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెబుతున్న షర్మిల..ఎక్కడా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకపోవటం ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. పవన్ ఇటు చంద్రబాబుతో పొత్తు కొనసాగిస్తూనే అటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీ కి ప్రత్యక్ష మిత్రుడుగా ఉన్న పవన్ పైన షర్మిల ఎలాంటి విమర్శలు చేయలేదు.

వైసీపీ కౌంటర్ ఎటాక్: తమ పార్టీ అధినేత పైన ఎవరు విమర్శలు చేసినా టీడీపీ నేతలు వెంటనే స్పందిస్తారు. కానీ, షర్మిల విమర్శల పైన మాత్రం ఇప్పటి వరకు టీడీపీ నుంచి సమాధానం లేదు. అదే సమయంలో అసలు పవన్ పైన షర్మిలే ఎలాంటి విమర్శలు చేయటం లేదు. గతంలో పవన్ సైతం ప్రత్యేక హోదా కోసం కీలక వ్యాఖ్యలు చేసారు. ఆ తరువాత ప్రస్తావన చేయటం లేదు.

ఇక, ఇప్పుడు జగన్ లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల రాకీయంలో షర్మిల శైలి పైన విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు షర్మిల విషయంలో ఆచితూచి స్పందించిన వైసీపీ, ఇప్పుడు ఇతర పార్టీల తరహాలోనే కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది. పవన్ ను షర్మిల విమర్శించకపోవటం పైనా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+