టీడీపీ కూటమికి చెంపపెట్టు: అధికారం శాశ్వతం కాదు: పెద్దిరెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన అనంతరం పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ తీర్పు వెలువడిన వెంటనే విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో అత్యవసర సమావేశం ఏర్పాటైంది. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ఈసీ కార్యదర్శి మల్లికార్జున, పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ రాజకుమారి, ఇతర అధికారులు ఇందులో పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని కాపాడే గొప్ప చర్యగా అభివర్ణించారు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్న పోలీసు, అధికారుల తీరుకు సుప్రీంకోర్టు ఆదేశాలు చెంపపెట్టు అని పేర్కొన్నారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్‌ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి ప్రతిపాదకులను అడ్డుకోవడం తక్షణమే ఆపాలని అన్నారు.

Peddireddy Ramachandra Reddy welcome supreme court directions reaffirmed the to equal opportunities

ఎంపీ మిథున్‌రెడ్డిపై అయిదు కేసులు నమోదు చేయడం, దాడులకు గురైన వైసీపీ కార్యకర్తలపైనే ఎదురు కేసులు పెట్టడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. నామినేషన్లు స్వీకరించకపోతే కలెక్టర్లను ఆశ్రయిస్తామని, అవసరమైతే మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతామని తేల్చి చెప్పారు.

వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనివ్వకుండా బ్యారికేడ్లు సైతం అడ్డుగా కట్టారు
వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనివ్వకుండా బ్యారికేడ్లు సైతం అడ్డుగా కట్టారు

సుప్రీంకోర్టు తీర్పుపై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడారు. కలెక్టర్ల సమక్షంలో నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక నిర్ణయమని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలను పక్కనపెట్టి, ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో గొడవలు సృష్టించడం, నామినేషన్లను అడ్డుకోవడం వంటి చర్యలను ఆపాలని హితవు పలికారు. మహిళలపై దాడులు చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ ఏకగ్రీవాల కోసం ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమో చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలని నిలదీశారు.

నామినేషన్ల గడువు పెంపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు
నామినేషన్ల గడువు పెంపు 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించకుండా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని అన్నారు. టీడీపీ నాయకులు కూడా గొడవలకు దిగకుండా పునరాలోచన చేయాలలని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అభ్యర్థికి నామినేషన్‌ వేసే అవకాశం కల్పించి, ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా ప్రభుత్వం, అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+