Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీటే లేదంటే..గెలిచికా నాకు ఆ పదవే కావాలంటున్న రఘురామ కృష్ణరాజు

వైసీపీ వివాదాస్పద ఎంపీ మరోసారి వార్తల్లో నిలిచారు. 2019 ఎన్నికల్లో రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరుఫున నరసాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్నిసందర్భాల్లో ఏకంగా సీఎం జగన్‌పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారాయన. నియోజకవర్గానికి దూరంగా ఉన్న రఘురామ ..ఢిల్లీలోనే ఉంటూ తన రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారాయన. పొత్తులో భాగంగా నరసాపురం నుంచి పోటీ చేయాలని చూసిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. బీజేపీ ,టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మను ఖారారు చేశారు. దీంతో రఘురామ కృష్ణం రాజుకు గట్టి షాక్ తగిలినట్టు అయింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశపడుతున్నారాయన.

People want to see me as speaker says ycp rebel Raghurama Krishnam Raju

బీజేపీ, జనసేన పార్టీల్లో రఘురామకు సీటు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మిగిలింది టీడీపీనే. ఆయన టీడీపీ తరుఫున పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆయన పెదమిరంలో మీడియాతో మాట్లాడుతూ...టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయటం తన ఆశయమని ఆయన తెలిపారు. నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అన్నది మరో రెండు రోజుల్లో తేలనుందని...అది ఎంపీగా.? లేదా ఎమ్మెల్యేగా.? అనేది క్లారిటీ రానుందని తెలిపారు.

ఈ ఎన్నికల్లో పోటీ చేయటం మాత్రం పక్కా అని తేల్చి చెప్పారాయన. ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ. కానీ ప్రజలు మాత్రం తాను అసెంబ్లీలో ఉండాలని కోరుకుంటున్నారు. చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారంటూ రఘురామకృష్ణరాజు తన మనస్సులో మాట చెప్పారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే ..వచ్చే ఎన్నికల్లో రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో రఘురామ పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+