కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ !
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా పోలీసులపై ఆయన చేసిన విమర్శలు, హెచ్చరికలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అలాగే Kollu Ravindraను ఉద్దేశించి కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు. "పేదల గుండెల్లో నువ్వు పెట్టిన నొప్పిని నీకూ చూపిస్తా" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.
"అధికారంలోకి వచ్చాక చూస్తా"...
అలానే పేర్ని నాని మాట్లాడుతూ.. పోలీసు అధికారులను నేరుగా ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు. అంతే కాకుండా ఈ వివాదంలో అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావును ఉద్దేశించి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనం రేపాయి. 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు.. నువ్వు ఎక్కడికి పారిపోయినా వదలను. బందరు కాదు.. ఆంధ్రా రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాసరే.. నువ్వు తెలంగాణ వెళ్తే.. అవసరమైతే కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. నీ ఇంటి సంగతి చూస్తా'' అని పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.

పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం..
మరోవైపు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై జిల్లా పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీస్ శాఖను బెదిరించేలా మాట్లాడటం అనేది అంగీకారయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలీస్ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీస్తాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాన్ని కాపాడే సంస్థలపై ఒత్తిడి తేవడం సరైంది కాదని పేర్కొన్నారు.
ఈ ఘటనలో పేర్ని నాని కుమారుడు Perni Kittu పాత్ర కూడా చర్చకు వచ్చింది. బందరు ప్రాంతంలో పోలీసులతో ఆయన వ్యవహరించిన తీరుపై కూడా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కుటుంబ స్థాయిలోనే పోలీస్ శాఖపై ప్రభావం చూపే ప్రయత్నంగా కనిపిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వ అధికారులను బెదిరించేలా వ్యాఖ్యలు చేయడం చట్టపరంగా సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపై ఎలాంటి లీగల్ చర్యలు తీసుకుంటారన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది.
-
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications