ఏపీ శాసన సభ: మీడియా పాయింట్ వద్ద నేతలు (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సోమవారం నాడు వాడిగా, వేడిగా సాగింది. ఉదయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు రోజా పైన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యల పైన గందరగోళం చెలరేగగా, సాయంత్రం సీఆర్డీఏ బిల్లు పైన ప్రభుత్వాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది.

సీఆర్డీఏ బిల్లు పైన వాడిగా, వేడిగా చర్చ సాగింది. మంత్రి నారాయణ బిల్లు ప్రవేశ పెట్టి వివరాలు చెబుతుండగా.. జగన్ నిలదీశారు.

అసలు మంత్రి చెబుతున్నవి బిల్లులో ఎక్కడున్నావని ప్రశ్నించారు. ఈ దశలో చంద్రబాబు, జగన్, మంత్రుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఓ సమయంలో జగన్‌కు ట్రెయినింగ్ ఇవ్వాలని కూడా చంద్రబాబు సహా అధికార పార్టీ సభ్యులు ఎద్దేవా చేశారు. దానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.

 అసెంబ్లీ

అసెంబ్లీ

సీఆర్డీఏ పైన దూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. రాజధాని సెజ్‌ల కోసం కాదని, రాజధాని కోసమని చెప్పారు. రాబోయే తరాల ఆశల సౌధాన్ని నిర్మించవలసి ఉందని చెప్పారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

సామాన్యుడు ఉండేలా రాజధాని నిర్మించడమే లక్ష్యమన్నారు. రాజధాని పరిధిలోని ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చంద్రబాబు కోరిక అన్నారు. ల్యాండ్ పూలింగ్ వల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు.

 అసెంబ్లీ

అసెంబ్లీ

ఓ సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. మీరు దోపిడీదారులని అందర్నీ అలా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. తాను దోపిడీదారుల గుండెల్లో నిద్రపోతానని చెప్పారు. అంతకుముందు రోజా పైన బుచ్చయ్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+