అదరగొట్టారు!: నీటిలో పడ్డ చిరు గంతులేశాడు (పిక్చర్స్)
రాజమండ్రి: పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో బోటు నుండి నీళ్లలో పడిపోయారు. ఇటీవల భారీగా కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. చిరంజీవి విశాఖ, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో పర్యటించారు.
ఆయన తూర్పు గోదావరి జిల్లా పర్యటన సమయంలో తిమ్మాపురంపేట గ్రామ ప్రజలు తమ గ్రామానికి వచ్చి పరిస్థితి చూడాల్సిందిగా చిరును కోరారు. దీంతో ఆయన పడవ సాయంతో అటు వైపు వెళ్లే ప్రయత్నాలు చేశారు. చిరంజీవితో పాటు పడవలో పలువురు కూర్చున్నారు.
జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడు దొమ్మేటి వెంకటేశ్వర్లు, శానససభ్యుడు కన్నబాబు, జిల్లా మంత్రి తోట నర్సింహం ఒకేసారి పడవ ఎక్కడంతో అది పక్కకు ఒరిగిపోయింది. దీంతో చిరంజీవితో పాటు మిగిలినవారు నీటిలో పడిపోయారు. తక్షణమే అప్రమత్తమైన సిబ్బంది వారిని పైకి తీశారు. ఆ తర్వాత పడవలోని నీటిని తొలగించి తిమ్మాపురం పేటకాలువ గట్టుకు పర్యటన సాగించారు. పరిమితికి మించి ఎక్కడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు.

చిరు 1
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తిమ్మాపురంపేట గ్రామానికి వెళ్తున్న సమయంలో పడవ పక్కకు ఒరిగిపోవడంతో నీటిలోకి జారిపడుతున్న దృశ్యం.

చిరు 2
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తిమ్మాపురంపేట గ్రామానికి వెళ్తున్న సమయంలో పడవ పక్కకు ఒరిగిపోవడంతో నీటిలోకి జారిపడ్డ దృశ్యం.

చిరు 3
కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

చిరు 4
కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో కాలువ దాటేందుకు దూకుతున్న దృశ్యం.

చిరు 5
కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

చిరు 6
కేంద్రమంత్రి చిరంజీవి సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో కాలువ దాటేందుకు గంతు వేస్తున్న దృశ్యం.

చిరు 7
చిరంజీవి సోమవారం విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో వర్ష ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించారు. ఈ సమయంలో నీటిలో పడ్డ వారికి చేయి అందిస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications