హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత, వీరే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిగ్ బజార్ చోరీ కేసు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్ పోలీసు స్టే,న్ ఇన్‌స్పెక్టర్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్, సిబ్బంది కలిసి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

ఈ నెల 22, 23 తేదీల మధ్య అర్థరాత్రి కాచిగుడా క్రాస్ రోడ్స్‌లోని బిగ్ బజార్‌ షాపింగ్ మాల్‌లో దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. దొంగలు భవనం సెల్లార్‌లోంచి రెండో అంతస్థులోకి వెళ్లి తలుపు తాళాన్ని పగులగొట్టి లేనికి ప్రవేశించారు. 32 లక్షల 27 వేల 290 రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ పరికరాలను ఎత్తుకెళ్లారు.

డిసిపి తూర్పు జోన్ డిసిపి షానవాజ్ నిందితులను మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఈ నెల 25వ తేదీన రాయదుర్గంలోని ఓ ఇంటిపై దాడి చేసి అనుమానితులను పట్టుకున్నారు. బిగ్ బజార్‌లో చోరీ చేసిన పరికరాలను ఏడు సంచుల్లో నింపి పెట్టడాన్ని గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

బిగ్ బజార్ దొంగల పట్టివేత

బిగ్ బజార్ దొంగల పట్టివేత

నిందితుల్లో కమ్ దాస్ (23) అనే వ్యక్తి ఉన్నాడు. సెక్యూరిటీ గార్డుగా పనిచేసే ఇతను అస్సాం రాష్ట్రానికి చెందినవాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కాచిగుడా బిగ్ బజార్ ఎదురుగా సందులోని రాజమొహల్లాలో ఉంటున్నాడు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

రతన్ దాస్ (20) అనే మరో నిందితుడు కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవాడే. ఇతను కూడా హైదరాబాదులో రాజమొహల్లాలోనే ఉంటున్నాడు.

బిగ్ బజార్ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ కేసు నిందితుల పట్టివేత

రూపమ్ కలిత (20) అనే మరో నిందితుడు కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవాడే. ఇతను కూడా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుంటాడు. ఇతను కూడా హైదరాబాదులో రాజమొహల్లాలోనే ఉంటున్నాడు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

రజనీ పేగు (24) అనే మరో నిందితుడు కూడా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతను కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవాడే. ఇతనూ హైదరాబాదులో రాజమొహల్లాలోనే ఉంటున్నాడు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

పరాగ జోతి దాస్ (24) అనే మరో నిందితుడు కూడా అస్సాం రాష్ట్రానికి చెందినవాడే. ఇతను కూడా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ రాజమొహల్లాలో ఉంటున్నాడు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

హైదరాబాద్ తూర్పు జోన్ డిసిపి షానవాజ్, ఎసిపి ఎల్‌టి చంద్ర శేఖర్ పర్యవేక్షణలో సుల్తాన్ బజార్ అసిస్టెంట్ పోలీసు కమిషనర్ టిఎస్ రవి కుమార్ ఆధ్వర్యంలో డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ కిశోర్ కుమార్‌తో పాటు జి. శ్రీనివాస్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

పోలీసులు నిందితుల నుంచి 391 వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 32 లక్షలకు పైగా ఉంటుందని అంచనా.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

నిందితుల నుంచి పోలీసులు 105 సెల్‌ఫోన్లు, 12 ల్యాప్‌టాప్స్, నాలుగు ట్యాబ్ -ఐపాడ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

నిందితుల నుంచి పోలీసులు 34 కెమెరాలో, నాలుగు లెన్సులు, ఒక డివిడి ప్లేయర్, ఒక స్పీకర్, నాలుగు ట్రాలీ బ్యాగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

బిగ్ బజార్ చోరీ కేసు నిందితుల పట్టివేత

నిందితుల నుంచి పోలీసులు 52 మొబైల్ చార్జర్స్, ఆరు ల్యాప్ టాప్ బ్యాటరీలు, 42 డాటా కేబుల్స్, 28 ఇయర్ ఫోన్లు, 32 ఫోన్ బ్యాటరీలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏడు ల్యాప్ టాప్ చార్జర్స్, 12 కెమెరా చార్జర్స్, రెండు కెమెరా బ్యాటరీలు, 45 కేబుల్ వైర్లను కూడా నిందితుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Hyderabad east zone police nabbed five accused in big bazar theft case at Kachiguda x roads in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X