జనవరిలో శ్రీవారి ఆలయంలో ఎన్నో ప్రత్యేక ఉత్సవాలు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో ఉత్తర ద్వార దర్శనాలు ఆరంభం అయ్యాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత 12:05 నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ఈ-డిప్ ద్వారా టికెట్లను పొందిన భక్తులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
భక్తుల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు, విజిలెన్స్ యంత్రాంగం సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేయడానికి చర్యలు తీసుకుంది. శిలాతోరణం, కృష్ణతేజ విశ్రాంతి గృహాల వద్ద సర్వదర్శనం టోకెన్ల తనిఖీ కేంద్రంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనిఖీ సైతం నిర్వహించారు. టోకెన్ల జారీ సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండటానికి చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ పరిణామాల మధ్య 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవంతో ఇవి ఆరంభమౌతాయి. 25వ తేదీన రథసప్తమితో ముగుస్తాయి. మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం, కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు, పురందరదాసుల ఆరాధన మహోత్సవం వంటివి ఈ జాబితాలో ఉన్నాయి.
జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది టీటీడీ. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు చేస్తారు. 14న భోగి, 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం, 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు వంటి విశేష ఉత్సవాలు ఉంటాయి. 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం, 23న వసంత పంచమి, 25న రథ సప్తమి వేడుకలు జరుపుతారు.
-
తిరుమల భక్తులకు శుభవార్త: జూన్ నెలలో దర్శనానికి, సేవలకు, గదులకు త్వరపడండి! -
భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలో యాదగిరిగుట్టలో కూడా ఆ సేవలు! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications