PM Kisan:పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం..!!
రైతులకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీపి కబురు. గత ఏడాది కాలంగా పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది. రెండు పథకాల నిధులు రైతుల ఖాతాల్లో ఒకే సమయంలో జమ కానున్నాయి. ఇప్పుడు ఈ ముహూర్తం పైన స్పష్టత వచ్చింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయనుంది.
కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తి కావటంతో రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా అందిస్తున్న పీఎం కిసాన్ 22వ విడత నిధుల విడుదల పైన ఒక నిర్ణయానికి వచ్చింది. నవంబర్ 19న 21వ విడత నిధులను ప్రధాని విడుదల చేసారు. కాగా.. ఏపీ ప్రభుత్వం ఇదే సమయంలో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తోంది. ఈ రెండు పథకాల నిధులు ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ 14 వేలు ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. కాగా, 22వ విడత నిధులను తొలుత సంక్రాంతి సమయంలోనే విడుదల చేస్తారని భావించారు. అయితే, ఫిబ్రవరి బడ్జెట్ సమయంలోనే విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 21వ తేదీన ఈ నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలో 11 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు 21 విడతల్లో రూ.4 లక్షల కోట్లకు పైగా నిధులు అందించారు.

రెండు పథకాల నిధులు ఒకే సారి రైతుల ఖాతాల్లో
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి తాము ప్రకటించిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు నిర్ణయించింది. ఈ మేరకు తొలి విడతగా పీఎం కిసాన్ తో కలిపి రెండు విడతల్లో రూ 5 వేలు చొప్పున రూ 10 వేలు రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, ఇప్పుడు మూడో విడత నిధులను పీఎం కిసాన్ 22వ విడత తో కలిపి జమ చేయనుంది. మూడో విడతగా ఏపీ ప్రభుత్వం అర్హత పొందిన రైతు ఖాతాల్లో రూ 4 వేలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ప్రతీ ఏటా మూడు విడతలుగా పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ 20 వేలు అన్నదాత సుఖీభవ నిధుల్లో కేంద్రం ఇస్తున్న రూ 6 వేలు మినహాయించి.. మిగిలిన రూ 14 వేలు మూడు విడతలుగా పీఎం కిసాన్ తో పాటుగా అందించాలని నిర్ణయించింది. దీంతో... పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులు కలిసి ఫిబ్రవరి రైతుల ఖాతాల్లో ఒకే సారి రూ 6 వేలు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
-
Mavigun Vs Amaravati: అమరావతి కంటే మావిగాన్ ఎలా బెటర్ ? అంబటి వివరణ..! -
శూన్యం నుంచి సృష్టి వరకు.. చరిత్ర నిన్ను క్షమించదు జగన్ -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!!











Click it and Unblock the Notifications