'మై గుడ్ ఫ్రెండ్' చంద్రబాబుకు మోదీ విషెస్ - పవన్ ఇలా.. జగన్, షర్మిల ప్రత్యేకంగా..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మదినం. సీఎం కు ప్రధాని మోదీ సహా పలువురు నేతలు .. ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు సీఎం జన్మదినం వేళ పెద్ద ఎత్తున ట్రెండింగ్ చేస్తున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సతీ సమేతంగా చంద్రబాబు తన జన్మదినం వేళ అన్నా క్యాంటీన్ లో అల్పాహారం చేయాలని నిర్ణయించారు. మాజీ సీఎం జగన్, పీసీసీ చీఫ్ షర్మిల ప్రత్యేకంగా చంద్రబాబుకు విషెస్ చెప్పారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం వేళ ప్రధాని మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు చేసిన ట్వీట్ లో కష్టపడి పని చేసే ఏపీ సీఎం ..తన మంచి మిత్రుడు గా పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని.. ఆయన మరింత ఆరోగ్యంగా ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. గవర్నర్ నజీర్ అహ్మద్ సైతం సీఎం చంద్రబాబు జన్మదిన వేళ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన గ్రీటింగ్స్ చెప్పారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. అమరావతి, పోలవరం నిర్మాణ లక్ష్యాల ను చేరుకోవాలని ఆకాంక్షించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటంతో పాటుగా స్వర్ణాంధ్ర కల సాకారం అవుతుందని పేర్కొన్నారు.

pm-modi-governor-many-leaders-extends-birth-day-wishes-for-ap-cm-chandra-babu-here-the-details

జగన్.. షర్మిల గ్రీటింగ్స్

https://twitter.com/realyssharmila/status/2046062674572890362`

https://twitter.com/narendramodi/status/2046055482851483802`

https://twitter.com/ysjagan/status/2046052561913036835`

https://twitter.com/PawanKalyan/status/2046059905011138744`

అన్ని రంగాల్లో ఏపీని ముందుకు తీసుకెళ్తున్న సీఎం చంద్రబాబు పూర్తి ఆరోగ్యంగా.. ఆనందంగా ప్రజా జీవితంలో ముందుకు వెళ్లాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఇక.. మాజీ సీఎం జగన్ సైతం ప్రత్యేకంగా చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంగా.. ప్రశాంతంగా ఉండాలని పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ షర్మిల సైతం ఎక్స్ ఖాతా ద్వారా చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పారు. చంద్రబాబుకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్షు.. ఆరోగ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ఇక, పార్టీ నేతలు.. శ్రేణులు పెద్ద ఎత్తున చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. భాష్యం సంస్థల అధినేత బాష్యం రామక్రిష్ణ సీఎం చంద్రబాబు పేరుతో తిరుమలలో ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి రూ 44 లక్షలు అందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. పార్టీ నేతలు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొంటున్నారు. చంద్రబాబు జన్మదినం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+