విశాఖకు ప్రధాని మోదీ - ముహూర్తం ఫిక్స్ : అక్కడే గుడ్ న్యూస్..!!

ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 11వ తేదీన ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు రానున్నారు. మూడు రాజధానుల వివాదం నేపథ్యంలో విశాఖ కేంద్రంగా కొంత కాలంగా పోటా పోటీ రాజకీయం చోటు చేసుటుంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించేదుకు సిద్దమవుతున్నాని ప్రభుత్వం చెబుతోంది. నవంబర్ 1న సుప్రీం కోర్టులో ప్రభుత్వం మూడు రాజధానుల వ్యవహారం పైన దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ విచారణకు రానుంది. ఇటు, ఉత్తరాంధ్ర మంత్రులు విశాఖ రాజధాని డిమాండ్ ను ఉద్యమంగా మార్చేందుకు అవసరమైతే రాజీనామాలకు సిద్దమని ముందుకొస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో పోటీ ఉద్యమానికి విశాఖ కేంద్రంగా సిద్దమవుతోంది.

ఈ సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. నవంబర్ 11న ప్రధాని మోదీ విశాఖ రైల్వే స్టేషన్ లో దాదాపుగా రూ 400 కోట్లతో చేపట్టనున్న నవీకరణ పనులను శంకుస్థాపన చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన మరి కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉంటాయి. అదే రోజున విశాఖలో బహిరంగ సభ లో ప్రధాని పాల్గొంటారు. ఏపీ బీజేపీ నేతలతోనూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం అదే రోజున ప్రధానితో భోగాపురం విమానాశ్రయం, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయించే విధంగా ఇప్పటికే పీఎంఓ కు ప్రతిపాదనలు పంపింది.

PM Modi to Arrive Vizag on 11th November, inaugurate many works and Atted the public meeting

విశాఖ నుంచి సీఎం జగన్ పాలన ప్రారంభించేందుకు సిద్దమవుతున్న వేళ..ఈ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.ఈ రెండు కార్యక్రమాలకు ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇక, ఉత్తరాంధ్ర కేంద్రంగా సాగుతున్న రాజకీయ యుద్దంలో విశాఖ రైల్వే జోన్ పైన కొంత కాలంగా సాగతీత ధోరణి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రధాని మోదీ అక్కడే స్పష్టమైన ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీంతో పాటుగా వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపు పైనా ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లొ ఏపీలో ప్రతిపక్షాల పొత్తుల పైన చర్చ సాగుతున్న వేళ.. ప్రధాని ఏపీ పర్యటన కీలకంగా మారుతోంది. అందునా విశాఖ కేంద్రంగా జరగనున్న ప్రధాని పర్యటనలో భవిష్యత్ అంచనాల పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+