Actress: వైసీపీ భజనలో తెలీలేదు, నటి బాయ్ ఫ్రెండ్ తో ట్విస్ట్

బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు అడ్డంగా బుక్ అయిపోయారు. ఇప్పటికే ముంబాయి నటి కేసులో పలువురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీ కేసులో పలువురు పోలీస్ అధికారులపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

ఇప్పుడు ఇదే ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీని మరో తప్పుడు కేసులో ఇరికించాలని ప్రయత్నించారని, ఆమె స్నేహితుడిపై తప్పుడు కేసు నమోదు చేశారని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఈ కేసులో ఏ పోలీసు అధికారులపైన వేటు పడుతుందో అని పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు చెక్క భజన చేసిన పోలీసు అధికారులు చేసిన తప్పే పదేపదే చేసి మరోసారి అడ్డంగా బుక్ అయిపోయారు.

Police filed a false case against Mumbai actress Jethwani boyfriend

బాలీవుడ్ నటి కాదాంబరీ జెత్వానీపై కేసు నమోదు చేయకుండానే ముందుగా ముంబాయికి విమానం టికెట్లు బుక్ చేసిన పోలీస్ అధికారులు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం జరిపిన విచారణలో అడ్డంగా చిక్కిపోయారు. ఈ కేసులో ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని తదితరులు సస్పెండ్ అయ్యి విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ పోలీసు అధికారుల మీద ముంబాయి నటి కాదంబరీ జెత్వానీ స్వయంగా కేసు పెట్టింది. ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీకి సంబంధించిన మరో కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.

ముంబాయి నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసిన తర్వాత ఆమెను కోర్టు ముందు హాజరు పరిచి విచారణ చేయడానికి పోలీసులు ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఆ సందర్భంలో కాదంబరీ జెత్వానీ ఉపయోగిస్తున్న ఐఫోన్ ఓపెన్ చేయడానికి పోలీసు అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. నటి కాదంబరీ జెత్వానీని విచారణ చేసిన ఆనాటి పోలీసు అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ఆమె ఐఫోన్ ఓపెన్ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలం అయ్యారని వెలుగు చూసింది.

ఆ తర్వాత ఐఫోన్ ఓపెన్ చేయాలంటే ఢిల్లీలో ఉన్న కాదంబరీ జెత్వానీ బాయ్ ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ పట్టుకుంటే సరిపోతుందని వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ పోలీస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణాకు చెప్పారని పోలీసు అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన సలహా మేరకు ఫిబ్రవరి 10వ తేదీన విజయవాడలోని పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేశారు. ఈ కేసులో దక్షిణ భారతదేశానికి చెందిన ఓ మహిళల అరెస్టు చేసిన పోలీసులు ఆమెను ఏ1 నిందితురాలిని చేశారు.

Police filed a false case against Mumbai actress Jethwani boyfriend

ఇదే కేసులో ముంబాయి నటి కాదాంబరీ జెత్వానీ బాయ్ ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ పేరును ను ఏ2 గా చేర్చారు. ఈశాన్య రాష్ట్రాల నుండి అమిత్ కుమార్ సింగ్ అమ్మాయిలను విజయవాడ సరఫరా చేసి స్పా సెంటర్ లో హైటెక్ వ్యభిచారం చేయిస్తున్నాడని అతని మీద తప్పుడు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన స్పా సెంటర్ పై దాడి జరిగితే ఫిబ్రవరి 9వ తేదీన విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి పోలీసు అధికారులు ఢిల్లీకి వెళ్లడానికి విమానం టికెట్లు బుక్ చేశారని పోలీసు అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.

ముంబాయి నటి జెత్వానీని అరెస్టు చేయడానికి ఆమె మీద కేసు నమోదు చెయ్యడానికి ముందు రోజు విమానం టికెట్లు బుక్ చేయడం, ఆ తరువాత ఆమె బాయ్ ఫ్రెండ్ ని అరెస్టు చేయడానికి ఢిల్లీ కి ఒక్క రోజు ముందుగానే విమానం టికెట్లు బుక్ చేయడం పోలీసు అధికారులు అడ్డంగా చిక్కిపోయారు. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ బాయ్ ఫ్రెండ్ ను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్లిన పోలీసులు అనేక ప్రాంతాల్లో అతని కోసం గాలించారు. అప్పటికే వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ నుండి ముంబాయి నటి కాదంబరీ జెత్వానీ బాయ్ ఫ్రెండ్ అమిత్ కుమార్ సింగ్ పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి అతని అడ్రస్ లో వెతికారు.

అయితే ఎక్కడా అమిత్ కుమార్ సింగ్ చిక్కకపోవడంతో పోలీసులు విజయవాడ తిరిగి వచ్చారు. ఆ తర్వాత ముంబాయి నటి పోలీస్ కస్టడీ పూర్తి కావడంతో ఆమెని కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో ముంబాయి నటి జెత్వానీ ఐఫోన్ ఓపెన్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన పోలీసు అధికారులు అది వీలుకాకపోవడంతో దానికి సంబంధించి మరో తప్పుడు కేసు నమోదు చేశారని ఇప్పుడు వెలుగు చూడడం కలకలం రేపుతోంది. ఈ కేసులో త్వరలో కొందరు పోలీసు అధికారులు సస్పెండ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+