బిడ్డ, బిడ్డపైనే కామవాంచ... అనంతరం హత్య... ఆత్మహత్యగా చీత్రీకరణ...!

స్వంత బిడ్డ, బిడ్డపైనే కన్నేశాడు ఓ కామంధుడు. వరసకు తాత అయినా... అభం శుభం తెలియని మనవరాలిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. బాలిక అంగీకరించకపోవడంతో మెడలు విరిచాడు.. అపస్మారక స్థితిలో ఉన్న బాలికపై అత్యాచారం చేసి తన కామవాంచ తీర్చుకున్నాడు. అనంతరం చున్నితో ఉరివేసి హత్య చేశాడు. దాన్ని ఆత్మహత్యగా చీత్రీకరించే ప్రయత్నం చేసిన... 72 సంవత్సరాల తాతను, పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు హజరుపర్చారు.

నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగిన ఘటన

నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగిన ఘటన

గత అయిదు రోజుల క్రితం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం బుచ్చిరెడ్డి పాలేం గూడేంలో 16యెళ్ల యువతి హత్య మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ దుర్ఘటనకు పాల్పడింది స్వంత తాతే అని తేలింది. వివారాల్లోకి వెళితే...సున్నపుబట్టి గిరిజన కాలనీ పాతూరులో కలగందలలో వెంకటేశ్వర్లు , రమణమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇక వారితో పాటు వారి కూతురైన పోలయ్య, మంగమ్మలు కూడ అక్కడే వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. కాగా గూడేంలో మొత్తం మూడు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. కాగా నిందితుడు వెంకటేశ్వర్లు ఓ నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్నాడు. అయితే తాతకు మనవరాలిపై కన్నుపడింది. మనవరాలితో కామవాంఛ తీర్చుకునేందుకు ఎప్పటి నుండే కన్ను వేశాడు.

బాలిక పెళ్లివిషయమై పేరెంట్స్ మధ్య మనస్పర్థలు

బాలిక పెళ్లివిషయమై పేరెంట్స్ మధ్య మనస్పర్థలు

కాగ వెంకటేశ్వర్లు కూతురు మంగమ్మ, అల్లుడు పోలయ్య కూడ అక్కడే నివాసం ఉంటున్నారు. కాగా వారికి కూడ ఇద్దరు కూతుళ్లు, మరో కుమారుడు ఉన్నాడు, ఇక పెద్ద కూతురికి పెళ్లి చేసిన పోలయ్య ,పదహారేళ్ల చిన్న కూతురుకు కూడ పెళ్లి చేయాలని నిర్ణయించాడు. కాని అమే మైనర్ కావడంతో పెళ్లికి మంగమ్మతో అమ్మాయి కూడ నిరాకరించింది. దీంతో ఇద్దరు భార్య, భర్తల మధ్య పెళ్లి విషయమై మనస్ఫర్థలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే వారం రోజుల క్రితం ఘర్షణ చెలరేగడంతో మంగమ్మ మనస్థాపం చెంది, ఇళ్లు విడిచి వెళ్లిపోయింది.

ఒంటరిగా ఉన్న మనవరాలిపై అత్యాచారం చేసిన తాత

ఒంటరిగా ఉన్న మనవరాలిపై అత్యాచారం చేసిన తాత

దీంతో పక్కనే ఉంటున్న తల్లి రమణమ్మ కూతురును వెతుక్కుంటూ.. వెళ్లింది. దీంతో మంగమ్మ ఇంట్లో చిన్న కూతురు ఒక్కతే ఉంది. దీంతో అప్పటికే మనవరాలిపై కన్నేసిన తాత వెంకటేశ్వర్లు కూతురు ఇంటికి వెళ్లాడు. మనవరాలిపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. కాని బాలిక తాత వికృత చేష్టలకు షాక్ అయింది. వెంటనే ప్రతిఘటించింది. అయితే అమేను మెడలు వంచి, విరిచాడు. అనంతరం దాడి చేశాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి, ఇది గమనించని నిందితుడు బాలికపై కామవాంఛ తీర్చుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాలిక నిందితుడి చేష్టలతో మృతి చెందింది. దీంతో వెంకటేశ్వర్లు దాన్ని అత్మహాత్య యత్నంగా చీత్రీకరించాడు. చున్నితో ఉరివేశాడు.

నిందుతున్ని పట్టించిన కత్తి...

నిందుతున్ని పట్టించిన కత్తి...

ఈనేపథ్యంలోనే పెళ్లి విషయంలో మనస్థాపంతో ఉరిపెట్టుకుందని పోలీసులకు చెప్పాడు. అయితే ఉరిపెట్టుకున్నట్టుగా ఆధారాలు లభించకపోవడంతో పాటు ఆయన భార్య రమణమ్మ కూడ పొంతనలేని సమాధానలు చెప్పింది. దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు.దీనికితోడు ఉరివేసిన చున్నిని కట్ చేసేందుకు తన స్వంత ఇంటిలోని కత్తిన వాడాడు వెంకటేశ్వర్లు అయితే ఆ కత్తి కూతురు మంగమ్మ ఇంటిలోదని నిందితుడు చెప్పడంతో పోలీసులు కూపి లాగారు. అనంతరం తమ స్ట్రైల్లో విచారణ చేపట్టడడంతో అసలు విషయం బయటపెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+