పెద్దిరెడ్డి దెబ్బ, మునిసిపల్ వైస్ ఛైర్మన్ కోసం పోలీసుల వేట, ఏం జరుగుతోంది ?
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి, పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ నాయకుడు మాధవ రెడ్డి కోసం 7 ప్రత్యేక టీమ్ పోలీసులు వెలుతున్న విషయం తెలిసిందే. ఇదే కేసుకు సంబందించి మదనపల్లె మునిసిపల్ వైచ్ చైర్మన్ జింకా వెంకటాచలపతి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పెద్దిరెడ్డి అనుచరుల్లో గత రెండు దశాభ్దాలుగా మదనపల్లెకు చెందిన జింకా వెంకటా చలపతి అలియాస్ జింకా చలపతి గుర్తింపు తెచ్చుకున్నారు. మదనపల్లె బీటీ కాలేజ్ లో చుదువుతున్న సమయంలో జింకా చలపతి ఎన్ఎస్క్ష్ యూఐ లీడర్ గా పని చేస్తున్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పీలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి పెద్దిరెడ్డి వర్గంలో జింకా వెంకటా చలపతి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మదనపల్లె మునిసిపల్ వైఎస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా గుర్తింపు ఉంది.

అంతే కాకుండా పుంగనూరు అసెంబ్లీ నియోజక వర్గం వైసీపీ ఎన్నికల పరిశీలకుడిగా ఉన్న జింకా వెంకటా చలపతి ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జింకా వెంకటా చలపతి భార్య కూడా మదనపల్లె మునిసిపాలిటి వార్డు నెంబర్ 11 కౌన్సిలర్ గా పని చేస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం కేసులో ఇప్పటికే మాధవ రెడ్డి పరారీలో ఉన్నాడు.
ఇదే కేసులో మదనపల్లె మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి పేరు బయటకు రావడంతో పోలీసులు ఆయన ఇంటిలో సోదాలు చేసి కొన్ని పత్రాలు స్వాదీనం చేసుకున్నారని వెలుగు చూసింది. రాజంపేట లోక్ సభ నియోజక వర్గం వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబాజాన్ కూడా మాయం అయ్యాడని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు.

ఇంటికి తాళం వేసిన బాబాజాన్ ఇప్పుడు పారిపోయాడని వెలుగు చూసింది. పెద్దిరెడ్డి వర్గీయులు అయిన మాధవ రెడ్డి, మదనపల్లె మునిసిపల్ వైఎస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి, బాబాజాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. జింకా చలపతితో అత్యంత సన్నిహితంగా ఉన్న కొందరు ఇప్పటికే మదనపల్లె వదిలి మాయం అయ్యారని తెలిసింది. మొత్తం మీద మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసు అగ్నిప్రమాదం కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది.












Click it and Unblock the Notifications