ఒకే వేదికపై షర్మిల, బొత్స-అరుదైన సీన్..!

ఏపీ రాజకీయాల్లో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా అన్న వైఎస్ జగన్ తో తీవ్రంగా విభేధిస్తూ నిత్యం వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ అనూహ్యంగా వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో కలిసి దర్శనమిచ్చారు. అంతే కాదు ఇద్దరూ ఒకే స్టేజ్ పై ప్రత్యక్షం కావడంతో ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

గత ఎన్నికలకు ముందు నుంచే వైఎస్ జగన్ తో విభేదిస్తున్న వైఎస్ షర్మిల నిత్యం అధికార పార్టీల నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువగా విపక్ష నేతపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అయితే ఇవాళ మాత్రం అనూహ్యంగా విశాఖలో నిర్వహించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక అఖిలపక్ష భేటీలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్ షర్మిల కనిపించారు. అంతే కాదు స్టేజ్ పై బొత్స పక్కనే ఆమె కనిపించారు. దీంతో ఈ భేటీలో అందరి దృష్టీ వీరిపైనే నెలకొంది.

political rivals ys Sharmila and botsa Satyanarayana on one stage for vizag steel plant fight

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం ప్రయత్నాలు వేగవంతం చేసిన నేపథ్యంలో విపక్ష పార్టీలైన కాంగ్రెస్, వైసీపీ దీనిపై కమ్యూనిస్టులతో కలిసి పోరాటాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ కాంగ్రెస్ నుంచి షర్మిల, వైసీపీ నుంచి బొత్స హాజరయ్యారు. సీపీఐ నుంచి రామకృష్ణ, సీపీఎం నేతలు కూడా హాజరయ్యారు. వీరంతా సభా వేదికపై ఉమ్మడిగా కూర్చోవడమే కాకుండా పరస్పరం పలకరించుకున్నారు కూడా.

political rivals ys Sharmila and botsa Satyanarayana on one stage for vizag steel plant fight

ఇందులో భాగంగా షర్మిల కూడా బొత్స సత్యనారాయణ పక్కనే కనిపించడం చర్చనీయాంశమైంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ విషయంలో సందర్భం దొరికినప్పుడల్లా జగన్ విమర్శలు చేస్తున్నారు. అలాగే బొత్స గురించి కూడా గతంలో షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం మాత్రం వీరిద్దరిని ఇలా కలిపిందందన్న చర్చ జరుగుతోంది. షర్మిలతో కలిసి బొత్స వేదిక పంచుకోవడం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఇరు పార్టీలు కలిసి ఉమ్మడి ఆందోళనలకు దిగుతారా అన్న చర్చ కూడా మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+