పూనమ్ వర్సెస్ రామ్ గోపాల్ వర్మ: సిస్టర్ అంటూనే..!!
అమరావతి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం.. బ్రో. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. సముద్రఖని దర్శకుడు. ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారానికి కేంద్రబిందువు అయింది.
గతంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన డాన్స్‌ను ఇందులో పేరడీగా పెట్టడం వివాదానికి దారి తీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ కమేడియన్ పృథ్వీ డాన్స్ చేయడం, ఆయనపై పవన్ కల్యాణ్ సెటైర్లు వేయడం కలకలం రేపుతోంది.

దీనిపై అంబటి రాంబాబు ఇప్పటికే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశాన్ని పెట్టి మరీ పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు సంధించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్‌ను హీరోగా పెట్టి తాను కూడా సినిమా తీస్తానని పేర్కొన్న ఆయన.. స్క్రిప్ట్‌ను కూడా వివరించారు. కొన్ని టైటిళ్లనూ సూచించారు.
ఈ పరిణామాలపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించిన విషయం తెలిసిందే. తాజా రాజకీయాలు, బ్రో సినిమా వివాదాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె సెటైర్లు వేశారు. రాజకీయాలు ఎంటర్‌టైనింగ్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ కాస్తా సో సీరియస్‌గా మారాయంటూ ఆమె చురకలు అంటిస్తూ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారామె.
ఈ ట్వీట్‌కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ట్విట్టర్ ద్వారానే పూనమ్ కౌర్‌కు రిప్లై ఇచ్చారు. రాజకీయాలు ఎంటర్‌టైనర్‌గా మారాయంటూ చేసిన వాదనలతో ఏకీభవించట్లేదని అన్నారు. నో సిస్టర్.. అంటూ తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు ఆర్జీవీ. రాజకీయాలు సినిమాలుగా.. సినిమాలు రాజకీయంగా తయారయ్యాయని కామెంట్స్ పెట్టారు.












Click it and Unblock the Notifications