Poonam Kaur: చంద్రబాబు విడుదల కోసం పూనమ్ కౌర్ పూజలు..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు విడుదల కోసం పూజలు మొదలయ్యాయి. ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ టీడీపీ అధినేత జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రత్యేకంగా పూజలు చేసారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న పూనమ్ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొన్నారు. ఈ వయసులో చంద్రబాబును జైలులో పెట్టటం కలిచి వేసిందన్నారు. చంద్రబాబు జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు.
చంద్రబాబు అరెస్ట్ అయి 40 రోజులు దాటింది. వచ్చే నెల 8వ తేదీ తరువాతనే చంద్రబాబు ఎప్పుడు బయటకు వచ్చేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోది. ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పైన పలువురు రాజకీయ - సినీ ప్రముఖులు స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా టీడీపీ నిరసనలు చేసింది.

ఇప్పుడు భువనేశ్వరి సైతం చంద్రబాబు అరెస్ట్ వార్తతో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు ఈ నెల 25వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించనున్నారు. అటు చంద్రబాబు అరెస్ట్ పైన న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ సమయంలోనే పలువురు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందిస్తున్నారు. ఈ సమయంలో విజయవాడ లో అమ్మవారిని దర్శించుకున్న పూనమ్ కౌర్ ఇదే అంశం పైన తన అభిప్రాయం స్పష్టం చేసారు.
మా కాళరాత్రిని పూజించేరోజున సౌమ్య రుద్ర రూపిణి గా కొలువైన విజయవాడ “కనకదుర్గమ్మ”ను నా పుట్టినరోజున దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా బావిస్తున్నాను.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 21, 2023
నిత్య జీవితంలో మహిళలు దుర్గమ్మ స్పూర్తితో ధృడసంకల్పంతో జీవించాలని కోరుకుంటున్నా pic.twitter.com/SCKVigm0Gk
చంద్రబాబు ఈ వయసులో అరెస్ట్ కావటం తన మనసు కలిచివేసిందన్నారు. ఆయన త్వరగా జైలు నుంచి విడుదల కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో పూనమ్ ఒక ట్వీట్ చేసారు. అందులో.. మా కాళరాత్రిని పూజించేరోజున సౌమ్య రుద్ర రూపిణి గా కొలువైన విజయవాడ "కనకదుర్గమ్మ"ను నా పుట్టినరోజున దర్శనం చేసుకోవటం నా అదృష్టంగా బావిస్తున్నాను.
నిత్య జీవితంలో మహిళలు దుర్గమ్మ స్పూర్తితో ధృడసంకల్పంతో జీవించాలని కోరుకుంటున్నా...అని పేర్కొన్నారు. పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో రాజకీయ - సామాజిక అంశాల పైన తరచూ స్పందిస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహారం ప్రధాన అంశంగా మారిన సమయంలో పూనమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications