‘పవర్ రేపిస్ట్’..హీరోయిన్ పూనమ్ కౌర్ సంచలన ట్వీట్..టార్గెట్ అతనే..!
హీరోయిన్ పూనమ్ కౌర్ చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. సినిమాలకు దూరంగా ఉంటున్న పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే పూనమ్ కౌర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల ఎప్పుడూపై పరోక్షంగా ట్వీట్లు చేస్తోంది. వీరి మధ్య ఏం జరిగిందో క్లారిటీ లేకపోయినప్పటికీ..అవకాశం చిక్కినప్పుడల్లా కూడా పవన్, త్రివిక్రమ్‌లపై మండిపడుతుంటారు.
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే పూనమ్ కౌర్ ఇటీవల రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వనికి మద్దతుగా పూనమ్ అనేకసార్లు రియాక్ట్ అయింది. జగన్ తీసుకుంటున్న సంస్కరణలకు మద్దతుగా ఆమె ట్వీట్లు చేసింది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన సమయంలో వ్యంగ్యంగా ట్వీట్ చేసి సంచలనం సృష్టించింది. ఆ మధ్య ప్రతి రాజకీయ నాయకుడు ఒక లీడర్ కాలేడంటూ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే ఆమె చేసిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. హాట్ హాట్‌గా సాగుతున్న ఏపీ రాజకీయాల గురించి తనదైనశైలిలో స్పందించారామె.

టీడీపీ ఎమ్మెల్యే లైంగిక వేధింపులపై పూనమ్ కౌర్ స్పందించింది. ఆమె తన ట్వీట్‌లో.."పవర్ రేపిస్ట్"ని బయటపెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను చాలా అభినందిస్తున్నాము - అతను అలా చేయకపోతే - #TDP నుండి ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యేది కాదు - చాలా మంది అధికారంలో ఉన్న తాము మౌనంగా ఉండండి అని చెబుతారు - అతనికి వందనాలు 🙏 మరియు అతనిని బహిర్గతం చేసిన స్త్రీ - ఆశను ఇస్తుందంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మీ మీడియా ముందుకొచ్చారు.
Highly appreciative of the husband who encouraged his partner to expose the “ POWER RAPIST” - had he not done that - the MLA from #TDP wouldn’t have be suspended - many would just say they in power keep quiet - kudos to him 🙏 and the woman who exposed him - gives hope . 🙏
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 5, 2024
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి , అసభ్యకరంగా ప్రవర్తిస్తూ , తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశారని వరలక్ష్మీ తెలిపారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికి, ఆయన నుంచి వేధింపులు ఎక్కువైయ్యాయని, ఆ తర్వాత నన్ను భయబ్రాంతులకు గురి చేసి, నన్ను లైంగికంగా చెరిచాడని ఆమె చెప్పారు. ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామంధుడు టార్చర్ చేస్తున్నాడని తెలిపింది.అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో, కోనేటి ఆదిమూలం బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో హోటల్‌లో సిక్రెట్ కెమెరాతో , ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డు చేశామని వరలక్ష్మీ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్ని కూడా ఆమె బయటపెట్టారు. ఈ విషయం మీద ఇప్పుడు పూనం ట్వీట్ చేసింది.
-
ఆ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు - తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications